ర్యాపిడో, ఓలా,ఉబెర్ సమ్మె..హైదరాబాద్ లో క్యాబ్ లను అడ్డుకున్న డ్రైవర్లు

ర్యాపిడో, ఓలా,ఉబెర్ సమ్మె..హైదరాబాద్ లో క్యాబ్ లను  అడ్డుకున్న డ్రైవర్లు

దేశ వ్యాప్తంగా ఇవాళ ఫిబ్రవరి 7న ర్యాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్ల సమ్మెకు దిగారు.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ పేరుతో సమ్మె చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో సమ్మెలో పాల్గొనని క్యాబ్ డ్రైవర్లను అడ్డుకుంటున్నారు డ్రైవర్లు. అడ్డుకుని వారిని సమ్మెలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారు. క్యాబ్ బుక్ చేసి వారిని పిలిపించి మరీ యాప్ ను ఆఫ్ చేస్తున్నారు.  గ్రేటర్ హైదరాబాద్ నార్సింగి సర్కిల్ కోకాపేట్ దగ్గర కొందరు రోడ్డుపై వస్తున్న ట్యాక్సీలను అడ్డుకుంటున్నారు. డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు.యాప్ ఆఫ్ చేసి సమ్మెలో పాల్గొనాలని కారుకు అడ్డం తిరిగారు. 

  తెలంగాణ గిగ్​ అండ్​ ప్లాట్ ఫాం​వర్కర్స్​ యూనియన్​(టీజీపీడబ్ల్యూయూ) పిలుపు మేరకు యాప్​ ఆధారంగా నడిపే ట్రాన్స్​పోర్ట్​ వాహనాల డ్రైవర్లు ఫిబ్రవరి 7న  సమ్మెకు దిగారు.  ర్యాపిడో, ఉబర్,  ఓలాతో పాటు ఆటోలు, గూడ్స్​ వాహనాలు, పోర్టర్​ డ్రైవర్లు దేశవ్యాప్తంగాసేవలను ఎక్కడికక్కడే నిలిపిసింది. . దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసనలో  భాగంగా హైదరాబాద్ లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి వేశారు. 

 గిగ్​ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. గిగ్​వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రేటు నిర్ణయించి కంపెనీల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు..  అలాగే..ఆటో, క్యాబ్, టాక్సీ, లారీ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు బంద్  నిర్వహించనున్నట్లు రాష్ట్ర మోటార్  కార్మికుల సంఘాల జేఏసీ ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు అమలుతో ఆటోడ్రైవర్ల ఆదాయంపై తగ్గిందని తెలిపింది. ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలను నియంత్రించాలని కోరింది.డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  భవిష్యత్తులో దీర్ఘకాలిక స్ట్రైక్‌కు సిద్ధమని తెలిపారు.