వీడు మామూలోడు కాదు..ఒకే ఇంటిని 25మందికి అమ్మాడు..రూ.500కోట్లు దోచుకున్నాడు

వీడు మామూలోడు కాదు..ఒకే ఇంటిని 25మందికి అమ్మాడు..రూ.500కోట్లు దోచుకున్నాడు

500 కోట్ల మోసం చేసిన  ఆరోపణలతో ఓ వ్యక్తిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒకే భవనాన్ని   25 మందికి  అమ్మడం ద్వారా మోసాలకుపాల్పడ్డారని  ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రూ.2.5 కోట్లకు  యూనిట్ కొనుగోలు చేసిన నిందితుడు దానిని 25మందికి  విక్రయించాడు. ఆతర్వాత ఓ కంపెనీకి లీజుకు ఇవ్వడం ద్వారా 500కోట్లు దండుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  

నిందితుడికి 6రోజుల పోలీసు రిమాండ్​ 

నిందితుడు 32వ మైల్​ స్టోన్​ డైరెక్టర్​ ధృవ్​ శర్మను అరెస్ట్​ చేశారు గురుగ్రామ్​ పోలీసులు. కోర్టు హాజరు పర్చగా నిందితుడికి ఆరు రోజుల కస్టడీ విధించింది. నిందితుడు 25మందికి పైగా వ్యక్తులను మోసం చేసి రూ. 500కోట్ల మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

మోసం ఎలా బయటపడిందంటే.. 

జనవరిలో  ట్రామ్​ వెంచర్స్ ప్రైవేట్​ లిమిటెడ్​ ప్రతినిధి ఆప్రా మోటెల్స్ (32వ మైల్ స్టోన్​విస్టా ప్రైవేట్​ లిమిటెడ్​ )పై ఫిర్యాదు చేయడంతో  భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 32వ మైల్​ స్టోన్​ కాంప్లెక్స్​ లో రూ.2.5కోట్లతో మొదటి అంతస్తులోని యూనిట్​ నం 24 ను కొనుగోలు చేసేందుకు  ట్రాం వెంచర్స్ ముందుకొచ్చింది. అయితే చెల్లింపుల తర్వాత కూడా కన్వీనియన్స్​ డీడ్​ ఇవ్వలేదు. ఫిర్యాదు దారుడు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో.. లీగల్​ నోటీసులు ఇచ్చాడు. అయినా స్పందించలేదు. 

ఇదే యూనిట్ కు అమ్మకానికి సంబంధించి మరో 25 మందిపేర్లతో  కన్వీనియన్స్​ డీడ్​ఇచ్చినట్లు ట్రాం వెంచర్స్​ కంపెనీ గుర్తించింది. దీంతో పో లీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 32వ మైల్​ స్టోన్​ కంపెనీ  డైరెక్టర్ ధృవ్ శర్మను శుక్రవారం (ఫిబ్రవరి 6)అరెస్ట్ చేశారు. 

నిందితుడు ధృవ్​ శర్మ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తన సహచరులతో కలిసి 2021లో 32వ మైల్​ స్టోన్​ బిల్డింగ్​ లోని మొదటి అంతస్తును రూ. 2.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాడు. అదే అంతస్తును మరో 25 మందికి  విక్రయించినట్లు తెలిపారు. ఆ తర్వాత తన మరో సంస్థ పేరుతో మొత్తం 25 మంది వ్యక్తులనుంచి 30ఏళ్లపాటు అదే అంతస్తును లీజుకు తీసుకొని మోసం చేసినట్లు తెలిపారు.