Moroccan Fan Gets Hit On His Groin Area: లైవ్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి వెళ్లేటప్పుడు హెల్మెట్లు, గార్డులు కూడా వేసుకుని వెళ్లాలేమో అనిపించే రేంజ్‌లో ఒక మైండ్ బ్లోయింగ్ కామెడీ సీన్ చోటు చేసుకుంది. ఫిఫా ప్రపంచ కప్ 2026 లో భాగంగా మొరాకో, హైతీ జట్ల మధ్య మ్యాచ్ అనగానే ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. కానీ ఒక మొరాకో అభిమానికి మాత్రం మ్యాచ్ ప్రారంభం కాకముందే.. జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది.
మొరాకో ఫ్యాన్కి అక్కడ తగిలిన ఫుట్‌బాల్:
మొరాకో ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు మైదానంలో వాల్యూమ్ పెంచి మరీ వార్మప్ (Warm-up) చేస్తున్నారు. ఒక ప్లేయర్ గోల్ కొడదామని ఫుట్‌బాల్‌ను బలంగా తన్నాడు. కట్ చేస్తే.. ఆ బంతి నెట్‌లోకి వెళ్లాల్సింది పోయి, రూట్ మ్యాప్ తప్పి నేరుగా గ్యాలరీలోకి దూసుకెళ్లింది. అక్కడ అమాయకంగా నిల్చుని ఉన్న ఒక మొరాకో అభిమాని సరిగ్గా ఎక్కడ తగలకూడదో.. అక్కడ (Groin area) బలంగా తాకింది.
థోగ్డెన్ కెమెరా క్లిక్.. నెట్టింట ఫన్నీ కామెంట్స్:
ఫుట్‌బాల్ ప్రపంచంలో తిరుగులేని కంటెంట్ క్రియేటర్ థోగ్డెన్ (Thogden) కరెక్ట్ టైమ్‌లో కెమెరా ఆన్ చేయడంతో ఈ లైవ్ విజువల్స్ కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. బంతి అంత స్పీడ్‌గా వచ్చి తగలడంతో ఆ అభిమాని పాపం స్పాట్‌లోనే నొప్పితో ఊపిరి ఆగిపోయినంత పని చేశాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్స్ మొదట కాస్త కంగారు పడినా.. ఆ సీన్ చూసి నవ్వు ఆపుకోవడం ఎవరి తరం కాలేదు.. ఒక చేత్తో నవ్వుతూనే, ఇంకో చేత్తో బాబు.. అంతా సేఫేనా? లైన్ క్లియర్‌గా ఉందా? అంటూ పరామర్శించారు.
నెటిజన్ల వెటకారం:
ఈ వీడియో నెట్‌లో వైరల్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు దొరికిందే ఛాన్స్ అంటూ కామెంట్ల రూపంలో కౌంటర్లు పేల్చడం స్టార్ట్ చేశారు. అసలైన మ్యాచ్‌లో కూడా మొరాకో ప్లేయర్లు ఇంత కరెక్ట్‌గా గోల్స్ కొట్టలేరేమో.. వీడు మాత్రం అస్సలు మిస్ కాకుండా కరెక్ట్ స్పాట్‌లో కొట్టాడు. అక్యూరసీ అంటే నీదే బ్రో అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఫ్రీగా మ్యాచ్ టికెట్ దొరికినా ఈ రేంజ్ రిస్క్ అయితే తీసుకోలేం బాబోయ్.. ఇకపై లైవ్ మ్యాచ్‌లకు వెళ్లే వాళ్లు ఎల్బో గార్డ్‌లతో పాటు లోయర్ గార్డ్స్ కూడా తెచ్చుకోండి అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
ALSO READ : రొనాల్డోకు గణపతి ఆశీస్సులు..
#FIFAWorldCup #FIFAWorldCup2026 #Haiti #Morocco #MoroccovsHaiti pic.twitter.com/2snXtOAJnB
— Chandra Shekhar Pamena (@PamanaChan58316) June 25, 2026
