SHOW TIME Trailer: వెంకటేష్ ‘దృశ్యం’ తరహాలో.. నవీన్ చంద్ర ‘షో టైమ్’ ట్రైలర్

SHOW TIME Trailer: వెంకటేష్ ‘దృశ్యం’ తరహాలో.. నవీన్ చంద్ర ‘షో టైమ్’ ట్రైలర్

తెలుగు టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర లేటెస్ట్ మూవీ ‘షో టైమ్’ (SHOW TIME). ఇందులో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. నేడు (జూన్24న) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఉత్కంఠరేపుతోంది. అనుకోకుండా ఎదురైన కష్టం నుంచి.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్న కథాంశంతో సినిమా రూపొందించారు డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి.

ప్రమాదవశాత్తు హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది నవీన్ చంద్ర ఫ్యామిలీ. ఈ జంట ఎదుర్కొనే కష్టాలను ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా నడిపించాడు డైరెక్టర్. ఈ క్రమంలోనే వారు చట్టాన్ని నమ్ముకుంటారు. దాంతో నవీన్ చంద్ర హడావిడిగా లాయర్ నరేష్ దగ్గరికి వెళ్లడం.. అతన్ని ఇంటికి తీసుకొచ్చి.. డోర్ ఓపెన్ చేస్తే ఇంట్లో శవం ఉండటం.. అతనెలా చనిపోయాడనే సస్పెన్స్ క్రియేట్ చేస్తూ చెప్పడం.. ఇంటెన్స్ పెంచుతోంది.

అంతేకాకుండా, ఈ హత్య నేనే చేశానంటూ తన భార్య చెప్పడం మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ చివరివరకు హత్యకు సంబంధించిన కారణాన్ని సస్పెన్స్ మెయింటేన్ చేయడం మూవీపై అంచనాలు పెంచుతోంది. 

‘షో టైమ్’టైటిల్కు తగ్గట్టుగా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మర్డర్ కేసునుంచి బయటపడటానికి నవీన్ చంద్ర తన ఫ్యామిలీని.. వెంకటేష్ దృశ్యం తరహాలో కాపాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా సక్సెస్‌‌‌‌‌‌‌‌పై కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నామని ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శక నిర్మాతలు తెలియజేశారు.  

స్కైలైన్ మూవీస్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి షో టైమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర  సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఎడిటర్ గా శరత్ కుమార్, టి వినోద్ రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జులై 4న మూవీ రిలీజ్ కానుంది