మే 7న నీట్ ఎగ్జామ్

మే 7న నీట్ ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్‌‌ టెస్ట్‌‌) యూజీ–2023 పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్‌‌ అయింది. ఈ ఎగ్జామ్​ను మే 7 నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్‌‌ ఏజెన్సీ సోమవారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల నుంచే అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఏప్రిల్ 6 అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. నీట్ ఎగ్జామ్ మే 7న(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు జరగనుంది. ఎగ్జామ్‌‌లో ఫిజిక్స్‌‌, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్‌‌ నుంచి 200 మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. ఇంగ్లిష్‌‌, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని వెల్లడించింది. దరఖాస్తు సమయంలోనే లాంగ్వేజ్‌‌ ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది.