రోడ్డు పక్కన దిగిన హెలికాఫ్టర్.. షాక్ అయిన సిటీ జనం

రోడ్డు పక్కన దిగిన హెలికాఫ్టర్.. షాక్ అయిన సిటీ జనం

హెలికాప్టర్‌ని చూడాలంటే ఎయిర్ పోర్టులోనే లేదంటే ఎవరైనా ప్రముఖులు వచ్చినపుడో చూసేందుకు వీలవుతుంది. కొంతమందికైతే దాన్ని దగ్గర్నుంచి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తూ ఉంటారు కూడా. అలాంటి హెలికాప్టర్.. రోడ్డుపై కనిపిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? అలా ఊహించడం కష్టమే కావచ్చు కానీ బెంగళూరులో అలాంటిదే జరిగింది. ట్రాఫిక్‌ కు కేరాఫ్ అడ్రస్ గా కనిపించే ఈ నగరంలో రోడ్డుపై ఆగి ఉన్న హెలికాప్టర్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Also Read :- ఈ అమ్మాయిని చంపినోడు.. పోలీస్ స్టేషన్లో ఉరేసుకున్నాడు

ఈ ఫొటో Xలో షేర్ అయ్యి.. వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో రోడ్డు పక్కన హెలికాప్టర్ నిలిపి ఉంచగా.. అది చూసిన ఆటో, బైక్ డ్రెవర్లు తమ వాహనాలను ఆపి మరీ దాన్ని వింతగా చూస్తున్నారు. ఈ ఫొటోకు బెంగళూరు ట్రాఫిక్‌కు కొత్త మార్గాలు అని క్యాప్షన్ ఇచ్చారు. విమానం కారణంగా వాహనాల రాకపోకలు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్‌ను ఎదుర్కోవడానికి నగరం ఇతర మార్గాలను రూపొందించిందా అంటూ ఈ ఫొటోను చూసిన కొందరు కామెంట్లు చేస్తున్నారు.