హనుమాన్ చూసి నేర్చుకోరా : ఓంరాత్ ను ఎక్కేస్తున్నారు

హనుమాన్ చూసి నేర్చుకోరా : ఓంరాత్ ను ఎక్కేస్తున్నారు

చిన్నదర్శకుడు..చిన్న హీరో..చిన్న బడ్జెట్..ఇన్నాళ్లు హనుమాన్(Hanuman) సినిమాపై వినిపించిన మాటలు. ఇప్పుడు చిన్న హీరో..చిన్న డైరెక్టర్..పెద్ద సక్సెస్..అనే మాటలు వినిపిస్తున్నాయి. అదేలా అంటే..హనుమాన్ మేకర్స్..కేవలం ఎంచుకున్న కథను వరల్డ్ వైడ్ గా ఎలా తీసుకెళ్లాలో..ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో అందరినీ ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నది ఆలోచించారు.అందుకే అన్నిఏరియాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

అయితే..హనుమాన్ సినిమా..ప్రభాస్ నటించిన అదిపురుష్ మేకర్స్కి గట్టి దెబ్బ కొట్టేలా చేసింది. అదేలా అనుకుంటున్నారా..హనుమాన్ సినిమాకు మేకర్స్ ఖర్చు పెట్టింది కేవలం రూ.20 నుంచి 25 కోట్లు మాత్రమే. కానీ సినిమా రాబట్టుకున్న అవుట్ పుట్ మాత్రం వంద కోట్లకు పైగా అన్నట్టు ఉంది.అంతేకాకుండా VFX విషయంలో కూడా అదిరిపోయే అవుట్ పుట్ని రాబట్టుకుంది. 

కానీ, అదిపురుష్(Adipurush) తెరకెక్కించిన డైరెక్టర్ ఓం రౌత్ (Omraut) మాత్రం అంతకుమించి అన్నట్లు ప్రమోషన్స్ చేశారు. అదిపురుష్ సినిమా ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన..చివరికి ఆశించిన ఫలితం దక్కలేదు. అంతేకాధు చీప్ వీఎఫ్ఎక్స్‌ అందించారని ఆడియన్స్ బాగా ఫైర్ అయ్యారు కూడా. దీంతో బాలీవుడ్ మేకర్స్..చిన్న డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ(Prasanth Varma)ను చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే..ఇంత తక్కువ బడ్జెట్తో..బెస్ట్ క్వాలిటీని ఎలా రాబట్టారో ప్రశాంత్ వర్మ నుంచి టాలీవుడ్‌, బాలీవుడ్ మేకర్లు తెలుసుకోవాల్సిన విషయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఏదేమైనా..హనుమాన్ సినిమా విషయంలో మేకర్స్ ముందు నుంచి చెప్పుకొచ్చిన కాన్ఫిడెన్స్..సినిమాలో కనిపించిందనే ఆడియన్స్ చెబుతున్నారు. ఇక సంక్రాంతి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యేలోపు..ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.