కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త టెక్నాలజీ

కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త టెక్నాలజీ

ప్రాజెక్టు నిర్వహణ కోసం డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ -ఈఎన్సీ మురళీధర్ వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో డెసిషన్ సపోర్ట్‌‌ సిస్టం (డీఎస్ఎస్) కీలకం కానుందని ఇరిగేషన్‌‌ ఈఎన్సీ మురళీధర్‌‌ తెలిపారు. బుధవారం జలసౌథలో నిర్వహించిన వర్క్‌‌షాప్‌‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డీఎస్ఎస్ తో గోదావరి, ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసే వానలను వారం రోజులు, వరదలను నెల రోజుల ముందే అంచనా వేయొచ్చని చెప్పారు. టెక్నికల్‌‌ సపోర్ట్‌‌ కోసం ఒక ప్రైవేట్‌‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, ఆ సంస్థ ఐదేండ్ల పాటు మెయింటెనెన్స్ చూసుకుంటుందని వివరించారు. ఈ టెక్నాలజీతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ ఈజీ అవుతుందన్నారు.