Theatre Movies: శ్రీరామ నవమి స్పెషల్.. ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి!

Theatre Movies: శ్రీరామ నవమి స్పెషల్.. ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి!

వీకెండ్ వచ్చింది అంటే చాలు.. సినిమా ప్రేక్షకులకు పండుగ మొదలైనట్టే. విడుదలయ్యే ప్రతి సినిమాపై ఓ లుక్కేస్తారు. కొత్త సినిమాలతో వీకెండ్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలతో ఆడియన్స్ మంచి జోష్లో ఉన్నారు.

అయితే, ఈ వీకెండ్ శ్రీరామ నవమి కూడా వస్తుండటంతో వచ్చే కొత్త సినిమాల రాక కోసం కూడా ప్రేక్షకులు ఓ లుక్కేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వారం (మార్చి 26, 27తేదీలలో) క్రేజీ సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. దాదాపు అన్నీ చిన్న సినిమాలే వస్తుండటం విశేషం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్, థ్రిల్లర్ అండ్ హారర్ జోనర్లో సినిమాలు సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ? వాటి కథ, కథనాలు ఏంటీ? అనేది ఓ లుక్కేద్దాం.

బ్యాండ్ మేళం (Band Melam):

‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మరో చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకుడు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన వెంకట్ నిర్మించారు. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 26న  సినిమా రిలీజ్ కానుంది. రూరల్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే లవ్ స్టోరీగా సినిమా తెరకెక్కింది.

ఇటీవలే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బావమరదలుగా రోషన్, శ్రీదేవి కనిపించనున్నారు. అయితే, వీళ్లిద్దరి అల్లరితో సరదాగా మొదలైన ప్రేమకథలో.. చిన్నపాటి అపార్థాలు దూరం పెంచాయనే పాయింట్‌తో సినిమా రూపొందింది.

సుయోధన (Suyodhana):

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ద్రిషిక చందర్ హీరోయిన్‌‌‌‌గా నటించగా, సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్ర పోషించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా శుక్రవారం మార్చి 27న సినిమా విడుదల కానుంది.

ఇదొక సస్పెన్స్‌తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్‌. దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఒక మనిషిని ‘సుయోధన’ అని ఎందుకు పిలుస్తారు? అదే వ్యక్తిని ‘దుర్యోధన’గా ఎందుకు భావిస్తారు? అనే ఆసక్తికరమైన పాయింట్‌పై కథ నడుస్తుందనే సంకేతాలు టీజర్ లో చూపించారు. 

గోట్ (G.O.A.T): 

సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందిన చిత్రం ‘గోట్‌‌’. దివ్యభారతి హీరోయిన్‌‌. వేదవ్యాస్‌‌ దర్శకుడు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. గురువారం మార్చి 26న సినిమాను విడుదల కానుంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్‌‌తో మూవీ తెరకెక్కింది. 

యూత్‌ (Youth)‌:

నటుడు కరుణాస్‌ తనయుడు కెన్ కరునాస్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ చిత్రం ‘యూత్‌‌’. దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో హౌస్​ఫుల్ వినీత్, సందీప్ విడుదల చేస్తున్నారు.

కాలేజ్ లైఫ్‌‌ను ఎంజాయ్ చేయాలనుకునే యూత్‌‌, మిడిల్‌‌ క్లాస్‌‌ పేరెంట్స్‌‌ వాళ్లపై పెట్టుకున్న నమ్మకాల నేపథ్యంలో మూవీ తెరకెక్కింది. ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్‌‌‌‌ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

హ్యాపీ రాజ్ (Happy Raj):

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, ‘మ్యాడ్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘హ్యాపీ రాజ్. ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ దీనికి దర్శకుడు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌‌పై జైవర్ద నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతోంది.

ఈనెల 27న తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిఫ్రెషింగ్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అబ్బాస్, జార్జ్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.