Niharika Konidela: హీరోయిన్గా మెగా డాటర్ రీ ఎంట్రీ.. షూటింగ్ స్టార్ట్

Niharika Konidela: హీరోయిన్గా మెగా డాటర్ రీ ఎంట్రీ.. షూటింగ్ స్టార్ట్

మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా రే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. RDX లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోగా చేసిన షాన్‌ నిగమ్‌(Shan Nigham) హీరోగా వస్తున్న కొత్త సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్నారు. మద్రాస్ కారన్(Madraskaaran)  టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు వాలిమోహన్‌ దాస్‌(Valilmohan Das) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన ఈ ప్రాజెక్టు.. ఈరోజు(ఫిబ్రవరి 15) పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 

ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పాన్‌రామ్‌ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా దర్శకుడు వాలిమోహన్‌ దాస్‌ మాట్లాడుతూ.. మద్రాస్ కారన్ అనేది యాక్షన్ అండ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ వస్తున్న సినిమా అని, కథ, కథనాలు ఆడియన్స్ ను అలరిస్తాయని, ఈ సినిమా కోసం  చైన్నె, మదురై, కొచ్చి ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నామని తెలిపారు. అతి త్వరగా సినిమా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపాడు. మరి ఈ సినిమాతో నిహారిక మంచి కంబ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి. 

ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు నిహారిక. మంచు మనోజ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ వాట్ ది ఫిష్ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు నిహారిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తన సొంత బ్యానర్ పిక్ ఎలిఫెంట్ సంస్థలో కూడా ఇటీవలే ఒక కొత్త సినిమాను ప్రారంభించారు నిహారిక. అంతా కొత్తవాళ్లతో వస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.