Samantha: సామ్ టేక్ 20..పాడ్ క్యాస్ట్ ప్రోమో..సమంత ఏం చెప్పబోతుందంటే?

Samantha: సామ్ టేక్ 20..పాడ్ క్యాస్ట్ ప్రోమో..సమంత ఏం చెప్పబోతుందంటే?

టాలీవుడ్ స్టార్​హీరోయిన్​సమంత(Samantha) సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్తో ఎప్పుడు టచ్లో ఉంటారు.నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏ పోస్ట్ చేసిన..చాలా మీనింగ్ ఉన్న కొటేషన్స్ షేర్ చేస్తుండటం విశేషం.

కొంత కాలంగా మాయో సైటిస్ (Myositis) వ్యాధితో బాధపడుతున్న సమంత(Samantha) సినిమాలకు బ్రేక్ ఇచ్చి పలు డిఫరెంట్ ట్రిప్స్ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్గా ట్రీట్ మెంట్ పూర్తీ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చిన సమంత ఇన్ స్టా వేదికగా పలు విశేషాలను పంచుకోనుంది. 

లేటెస్ట్గా సామ్ టేక్ 20(Take 20) అనే పాడ్ క్యాస్ట్ను ప్రారంభించింది. ఇందులో కేవలం హెల్త్కి సంబంధించిన విషయాలను, ఎన్నో తెలియని వ్యాధులకు సమాధానాలు మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చింది సామ్. గత మూడేళ్ళుగా తాను మాయో సైటిస్ వలన అనుభవించిన బాధ, దాన్ని నుంచి కోలుకుని..తాను ఎలా మాములు మనిషిలా అయ్యాననే విషయం చెప్పుకొచ్చింది 

ఈ టేక్ 20 లో హై క్వాలిటీ వెల్ నెస్ కంటెంట్ ఉంటుందని, అది ఈ సమాజంలో అందరి జీవితాలను ఖచ్చితంగా మార్చే విధంగా ఉండబోతుందని సామ్ తెలిపింది. అంతేకాదు..ఇందులో చెప్పేవి అన్ని ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది మేధావులు రీసెర్చ్ చేసినవని, చాలా విషయాలని అనుభవజ్ఞుల నుంచి  తీసుకున్నవని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఫిబ్రవరి 19న అందుబాటులోకి రానుంది. 

ఇక సమంత సినిమాలు విషయానికొస్తే.. ప్రసెంట్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ సిటాడెల్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.ఈ మూవీ అమెరికన్ టీవీ సిరీస్ కు స్ఫూర్తిగా తెరక్కుతున్నట్లు తెలుస్తుంది. త్వరలో సమంత తన కొత్త ప్రాజెక్ట్స్ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.