Niharika: నిహారిక నిర్మాణంలో లేడీ డైరెక్టర్.. సంగీత్ శోభన్తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

Niharika: నిహారిక నిర్మాణంలో లేడీ డైరెక్టర్.. సంగీత్ శోభన్తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో కమర్షియల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌తో పాటు గద్దర్ అవార్డ్స్‌‌‌‌ను కూడా అందుకున్న నిహారిక కొణెదల.. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో రెండో సినిమా చేస్తోంది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో మెప్పించిన సంగీత్‌‌‌‌కు సోలో హీరోగా ఇదే ఫస్ట్ సినిమా. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. గురువారం ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. గతంలో నిహారిక నిర్మించిన హలో వరల్డ్‌‌‌‌, బెంచ్‌‌‌‌లైఫ్‌‌‌‌ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లతో గుర్తింపును అందుకున్న నయన్ సారిక.. ఆయ్, క చిత్రాలతో విజయాలను అందుకుంది.

తనకు గుర్తింపును ఇచ్చిన బ్యానర్‌‌‌‌‌‌‌‌లోనే మరోసారి నటించబోతోంది. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.