Poonam Kaur : 'నీలో ఇక ఫన్ లేదు గురూజీ'.. త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ పోస్ట్!

Poonam Kaur : 'నీలో ఇక ఫన్ లేదు గురూజీ'.. త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ పోస్ట్!

నటి పూనమ్ కౌర్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేసూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ పలు సందర్భాల్లో పరోక్ష వ్యాఖ్యలు చేసిన పూనమ్.. ఈసారి ఏకంగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావించడంతో అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి మొదలైంది. ఆమె పోస్టులు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

"నీలో ఇక ఆ పాత వినోదం లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్.. గతంలో నువ్వు సాధించిన ఆ ఉన్నత స్థానానికి మళ్లీ ఎప్పటికీ వెళ్లలేవు" అంటూ పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ ఒక్కసారిగా దుమారం రేపింది. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ మేకింగ్‌పై, ఆయన మార్క్ చమత్కారంపై నేరుగా కామెంట్స్ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు దర్శకుడి సినిమాలపై విమర్శనా? లేక వ్యక్తిగతంగా ఆయనను ఉద్దేశించినవా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

ఇదిలా ఉంటే.. పూనమ్ షేర్ చేసిన మరో పోస్ట్ మరింత సంచలనంగా మారింది. ఓ నటి కోసం తన సొంత భార్యపైనే కొమాలోకి వెళ్లేతా దాడికి తెగబడ్డాడంటూ ఒక వ్యక్తిపై ఆమె మైండ్ బ్లాకింగ్ ఆరోపణలు చేసింది. అయితే ఈ పోస్ట్‌లో ఆ వ్యక్తి పేరును నేరుగా బహిర్గతం చేయనప్పటికీ, టాలీవుడ్‌లో 'గురూజీ' అని పిలువబడే దర్శకుడిని ఉద్దేశించే ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉంటుందని నెటిజన్లు ముమ్మరంగా చర్చించుకుంటున్నారు.

 అయితే టాలీవుడ్‌లో త్రివిక్రమ్‌ను చాలామంది 'గురూజీ' అని పిలుస్తుండటంతో ఈ పోస్టు ఆయనను ఉద్దేశించే పెట్టిందా? అంటూ కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా పూనమ్‌ తన పోస్టులో నేరుగా పేరు వెల్లడించకపోవడంతో ఆమె వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించాయన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల కూడా పూనమ్..  తన కుటుంబ సభ్యుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారి ద్వారా తనకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇప్పించారని త్రివిక్రమ్ ను ఉద్దేశించిన తీవ్ర ఆరోపణలు చేశారు.

ALSO READ :  'రణబాలి' రిలీజ్ వేళ సాయిబాబా సన్నిధిలో విజయ్–రష్మిక.. 

ఇదిలా ఉండగా.. చాలా కాలంగా పూనమ్ కౌర్, త్రివిక్రమ్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం పరిశ్రమలో ఉంది. తన కెరీర్ నాశనం కావడానికి, అవకాశాలు రాకుండా పోవడానికి ఆయనే కారణమంటూ పలు సందర్భాల్లో ఆమె పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి నేరుగా విమర్శలు గుప్పించడంతో ఈ 'పూనమ్ vs త్రివిక్రమ్' వివాదం టాలీవుడ్ విశ్లేషకుల్లో సరికొత్త హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ సంచలన పోస్టులపై గురూజీ కాంపౌండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.