Bigg Boss Telugu Season 10: 'ఆటలో కాదు.. ఆటే సవాల్'.. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' గ్రాండ్ లాంచ్ ముహూర్తం ఫిక్స్!

Bigg Boss Telugu Season 10: 'ఆటలో కాదు.. ఆటే సవాల్'.. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' గ్రాండ్ లాంచ్ ముహూర్తం ఫిక్స్!

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ ' మరో సారి రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఈ షో వస్తుందంటే చాలు చేస్తున్న పనులను సైతం పక్కన పెట్టేసి టీవీల ముందు వాలిపోతారు అభిమానులు.  అయితే ఈసారి తెలుగులో 'దశావతారం' అనే వినూత్న కాన్సెప్ట్‌తో.. ఊహకు అందని సవాళ్లు, ట్విస్టులతో ప్రేక్షకులను అలరించేందుకు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' రంగం సిద్ధం చేసుకుంది.  ఈ క్రమంలోనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ లాంచ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

'బిగ్ బాస్10' గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?

లేటెస్ట్ గా ప్రమోషన్ ప్రోమోలో ఈ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ప్రారంభం డేట్ ను వెల్లడించారు.  సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు స్టార్ మా , డిస్నీ+ హాట్‌స్టార్‌లలో ఈ రియాలిటీ జాతర ఘనంగా ప్రారంభం కానుంది. గ్లామర్, వినోదం మేళవిస్తూ టాలీవుడ్ 'కింగ్' నాగార్జున ఐకానిక్ హోస్ట్‌గా మరోసారి సందడి చేయనున్నారు.

 ఆటే సవాల్..

ఈ ప్రోమోలో నాగార్జున చెప్పిన 'ఆటలో కాదు.. ఆటే సవాల్' అనే పవర్‌ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రతీ సవాలు, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ ఈసారి 10 రెట్లు ఎక్కువగా ఉండబోతుందని ప్రోమో స్పష్టం చేస్తోంది. దీంతో ఈ షో పై అంచనాలను మరింత పెంచేస్తోంది. 

ALSO READ : 'పాపం చేశా.. నన్ను క్షమించండి'.. 

 

కామనర్స్‌కి అగ్నిపరీక్ష ..

గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా సామాన్యులకు పెద్దపీట వేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' లో ఆరంభంలో 70 మంది పోటీ పడగా, కఠినమైన టాస్కుల ద్వారా 15 మందిని ఫైనల్ చేశారు. అందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఐదుగురికి ప్రధాన బిగ్ బాస్ హౌస్‌లోకి నేరుగా ప్రవేశం లభించనుంది. మరికొందరిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపే అవకాశం ఉంది.

సెలబ్రిటీల పోరు..

ఇక హౌస్‌లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టబోయే సెలబ్రిటీల లిస్ట్ పై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. బుల్లితెర సీరియల్ నటులతో పాటు కమెడియన్ల హవా ఈసారి ఎక్కువగా ఉండబోతోంది.. వారిలో   దేబ్జానీ మోదక్, ముఖేష్ గౌడ, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ,  జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్, నూకరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, రాకింగ్ రాకేష్, యాంకర్ వర్షిణి, సుధీర్ రెడ్డి, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, ఫోక్ డ్యాన్సర్ మాథురీ రాథోడ్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  

అయితే బిగ్ బాస్ మేకర్స్ ఇప్పటి వరకు ఎవరి పేర్లు అధికారకంగా ప్రకటించలేదు. సెప్టెంబర్ 6న జరగబోయే గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లోనే ఈ ఉత్కంఠకు పూర్తి తెరపడనుంది. కంటెస్టెంట్ల అసలు సిసలైన పోరు, ఎమోషన్స్, వ్యూహాలతో బుల్లితెరపై సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి బిగ్ బాస్ 10 సిద్ధంగా ఉంది..