'పాపం చేశా.. నన్ను క్షమించండి'.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్!

'పాపం చేశా.. నన్ను క్షమించండి'.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడిన హై-ప్రొఫైల్ కేసు ఊహించని మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు, బంగ్లాదేశీ జాతీయుడైన 31 ఏళ్ల మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం ఉన్నట్టుండి ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఇన్నాళ్లుగా కేసు విచారణను ఎదుర్కొంటున్న అతడు ఇప్పుడు ఏకంగా తనపై నమోదైన నేరాలను అంగీకరించేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశమైంది.

తీవ్రమైన నేరారోపణలతో జ్యుడీషియల్ కస్టడీలో శిక్ష అనుభవిస్తున్న షరీఫుల్, తాను చేసిన దారుణమైన నేరాన్ని ఎలాంటి షరతులు లేకుండా అంగీకరించేందుకుసిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు వెల్లడించాడు. కోర్టు ఇటీవల ఇతనిపై తీవ్రస్థాయి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. నేను తప్పు చేశాను.. నా నేరాన్ని అంగీకరిస్తున్నాను, కాబట్టి శిక్ష విధించే సమయంలో నాపై కాస్త కనికరం చూపించండి అంటూ కోర్టును  వేడుకున్నట్లు సమాచారం. 

సైఫ్ అలీ ఖాన్   ముంబై బాంద్రా నివాసంలోకి అక్రమంగా చొరబడి, ఆయనపై భౌతిక దాడికి దిగాడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. సెలబ్రిటీ హోదా ఉన్న సైఫ్ బాంద్రా నివాసంలోకి విదేశీయుడు చొరబడటం అప్పట్లో ముంబై పోలీసుల భద్రతా వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీసింది. గతంలో బాంబై సెషన్స్ కోర్టులో తాను అమాయకుడినని చెప్పిన షరీఫుల్.. ఇప్పుడు తనపై నమోదైన నేరాలను అంగీకరించేందుకు సిద్ధమవడం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు నిందితుడు స్వయంగా నేరాంగీకారానికి ముందుకు రావడంతో, ఈ విజ్ఞప్తిపై ప్రాసిక్యూషన్ తమ తీవ్రమైన అభ్యంతరాలు ,  స్పందనను దాఖలు చేయాలని సెషన్స్ కోర్టు ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం చట్టవిరుద్ధంగా దేశంలోకి చొరబడటంతో పాటు, విఐపిపై దాడి చేసిన ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? కోర్టు అతడికి ఊరటనిస్తుందా లేక కఠిన శిక్ష విధిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..