హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా కార్యక్రమంలో అధికారులపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటే ఇక ఎమ్మెల్యే ఉండేది ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దానం నాగేందర్. లక్కీ డ్రా నిర్వహిస్తున్న అధికారి నుంచి దానం నాగేందర్ మైక్ లాక్కోవడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.
ఎమ్మెల్యే అంటే గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు.మీకు మేరే డ్రా నిర్వహించి మీరే ఇళ్ళు ఇచ్చుకుంటూ పోతే ఎలా అంటూ ప్రశ్నించారు దానం నాగేందర్. దీనిపై ప్రివిలేజ్ నోటిస్ జారీ చేస్తానంటూ హెచ్చరించారు. సభ నుంచి కోపంతో వెళ్లిపోతున్న దానం నాగేందర్ ను సార్ ఒక్క నిమిషం సార్ అంటూ సదరు అధికారి పిలువగా... ఏంటి ఒక్క నిమిషం.. సిగ్గుండాలి, ఎమ్మెల్యే అంటే భయం లేకుండా పోయిందంటూ అంటూ దబాయించారు.
లక్కీ డ్రాలో ఇళ్ళు రానివారు తన దగ్గరికి రావాలని.. గల్ల పట్టి ఇళ్ళు ఇప్పిస్తానని చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు దానం నాగేందర్. ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పట్ల దానం నాగేందర్ వ్యవహరించిన తీరు సరికాదని అంటున్నారు నెటిజన్స్.
