హైద్రాబాద్ మెట్రో లో సాంకేతిక లోపాలు.. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర పనిచేయని స్కానర్లు... క్యూ కట్టిన ప్రయాణికులు..

హైద్రాబాద్ మెట్రో లో సాంకేతిక లోపాలు.. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర పనిచేయని స్కానర్లు... క్యూ కట్టిన ప్రయాణికులు..

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం ( ఆగస్టు 29 ) మెట్రో ఆన్ లైన్ టికెటింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ముందుగా మెట్రో టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. టికెట్ తీసుకున్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర స్కానింగ్ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు క్యూలోనే ఉండిపోవాల్సి పరిస్థితి నెలకొంది.

ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర స్కానర్ పనిచేయకపోవడంతో ట్రైన్ దిగినవారు బయటికి రాలేక, ట్రైన్ ఎక్కాలనుకున్నవారు స్టేషన్ లోపలి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఆన్ లైన్ సేవలు నిలిచిపోవడంతో మెట్రో సిబ్బంది కూడా చేతులెత్తేశారు. టికెట్ తీసుకున్నా కూడా ఎంట్రీ దగ్గర వేచి ఉండాల్సి రావడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

ఇటీవల కాలంలో తరచూ ఆన్ లైన్ టికెట్ బుకింగ్, స్కానింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోందని అంటున్నారు ప్రయాణికులు. సమస్యను త్వరగా పరిష్కరించి ఆన్లైన్ టికెటింగ్, స్కానింగ్ సేవలు పునరుద్దరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పరిష్కారం చుప్పలని కోరుతున్నారు.