బోడుప్పల్ రామచెరువులో ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలు... పది టన్నుల చేపలు మృతి..!

బోడుప్పల్ రామచెరువులో ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలు... పది టన్నుల చేపలు మృతి..!

హైదరాబాద్ శివారులో ఏ చెరువు చూసినా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాల వల్ల కలుషితం అయ్యే ఉంటుంది. దీంతో చెరువుల సమీపంలో నివసించే జనం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బోడుప్పల్ లో కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు జనం. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాల కారణంగా శనివారం ( ఆగస్టు 29 ) స్థానిక రామచెరువులో టన్నుల కొద్దీ చేపలు మృతి చెందాయి.

చెరువులో కెమికల్ వ్యర్థాల వల్ల సుమారు పది టన్నుల చేపలు మృతి చెందాయి అని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.చేపల మృతితో అర కిలోమీటర్ మేర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు స్థానికులు.

ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని..నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. చెరువులోకి కెమికల్ వ్యర్థాలు రాకుండా చర్యలు చేపట్టి రీసైక్లింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. సిటీలో చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా ఈ సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు స్థానికులు.