హైదరాబాద్ NFCలో 400పైగా అప్రెంటిస్ ఉద్యోగాలు.. ఐటీఐ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు..

హైదరాబాద్ NFCలో 400పైగా అప్రెంటిస్ ఉద్యోగాలు.. ఐటీఐ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు..

హైదరాబాద్​లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్  ద్వారా మొత్తం 431 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్. 

మొత్తం ఖాళీలు: 432.

విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్ 133, టర్నర్ 151, ఎలక్ట్రీషియన్ 58, మెషినిస్ట్ 24, అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్/ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్)13, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 15, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 26, లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) 6, మోటార్ మెకానిక్స్ (వెహికల్) 3, డ్రాఫ్ట్స్ మన్ (మెకానికల్) 1, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ) 65, డీజిల్ మెకానిక్ 3, ప్లంబర్ 5, కార్పెంటర్ 5, వెల్డర్ 24. 

ఎలిజిబిలిటీ
*గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
*పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
*ఏదైనా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ సంస్థలో ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం శిక్షణ పొందుతున్నవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

గరిష్ట వయోపరిమితి: 25 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 27.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 16. 

సెలెక్షన్ ప్రాసెస్: వాక్​ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nfc.gov.in ను సందర్శించండి.