దేవర వీడియో లీక్.. షాకులో మేకర్స్

దేవర వీడియో లీక్.. షాకులో మేకర్స్

కొరటాల శివ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర..  రెండు పార్టులుగా వస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  ఇప్పటికే రిలీజ్ చేసిన   టీజర్, పోస్టర్స్ సినిమాపై మంచి హైప్స్ ను పెంచేశాయి.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన -ఓ వీడియో లీకైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  

ఇందులో తారక్ బ్లాక్ షర్ట్, లుంగీ కట్టుకొని బీచ్ నుంచి అలా నడుచుకొని బయటికి వస్తున్నారు. ఇది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్ అవుతుంటే మేకర్స్ మాత్రం వీడియో లీక్ పై మండిపడుతున్నారు . దేవర టీమ్ ప్రస్తుతం గోవాలో షూటింగ్ చేస్తుంది. ఈ సందర్భంగా దేవర సెట్‌ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ వీడియో ఒకటి లీకైంది. ఎవరో దీన్ని దూరం నుంచి ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.  

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన   జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..  సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.