టిల్లు స్క్వేర్‌‌‌‌ సరికొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుంది

టిల్లు స్క్వేర్‌‌‌‌ సరికొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుంది

‘డీజే టిల్లు’గా ప్రేక్షకులను ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్‌‌‌‌‌‌‌‌’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో  సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ ‘‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్‌‌‌‌మెంట్స్‌‌‌‌తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.  

మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు. సినిమాలో సిద్ధు ప్రమేయం ఉంటుందని బయట ఏవో  వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు.  సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. 

ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. ఇద్దరం కలిసి సమన్వయంతో ఈ సినిమా చేశాం. ఇది కంప్లీట్ టిల్లు క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు సాగే సినిమా. ఇక  అనుపమ పరమేశ్వరన్ లిల్లీ అనే చాలెంజింగ్ రోల్‌‌‌‌ చేసింది.  ఆమెను బోల్డ్‌‌‌‌గా చూపించాలనే ఉద్దేశం మాకు లేదు. ఆ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌‌‌‌‌‌‌‌కి కొంత తేడా ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ.  ఇందులో అలా ఉండదు. రాధిక పాత్ర ప్రస్తావనతో  మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి.  డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఫస్ట్ పార్ట్ నచ్చిన వారికి ఇది ఏమాత్రం నిరాశపరచదు.  సితార బ్యానర్ లో పనిచేయడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో  టిల్లు-3 కూడా  వచ్చే అవకాశముంది’ అని చెప్పాడు.