War 2: వార్ 2 లేటెస్ట్ అప్డేట్.. ఎన్టీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధం!

War 2: వార్ 2 లేటెస్ట్ అప్డేట్.. ఎన్టీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధం!

ఆర్ఆర్ఆర్(RRR) గ్లోబల్ సక్సెస్ తరువాత క్రేజీ సినిమాలు చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr). తన తరువాతి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్టులను ఒకే చేసేశారు తారక్. వాటిలో ఒకటి కొరటాల చేస్తున్న దేవర(Devara) కాగా.. రెండవది బాలీవుడ్ మూవీ వార్ 2(War 2). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరీ ముఖ్యంగా వార్ 2 మూవీపై మరింత ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. కారణం.. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హ్రితిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అందుకే ఈ సినిమాపై ఇండియన్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. 2019లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటం కూడా ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన దర్శకుడు సిద్దార్థ ఆనంద్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. 

ALSO READ :- 12th Fail: తెలుగులో వచ్చేసిన 12th ఫెయిల్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. వచ్చే నెల నుండి వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడట ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం హ్రితిక్ రోషన్ కు సంబందించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్న మేకర్స్.. వచ్చే నెలల్లో మొదలయ్యే షెడ్యూల్ నుండి ఎన్టీఆర్ సీన్స్ తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ న్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.