బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు సృష్టించే ప్రభంజనం మాములుగా ఉండదు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఊహించని స్థాయిలో రికార్డులను తిరగరాస్తోంది హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) . హాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ మూవీని కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ప్రముఖ దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా రూ. 1600 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇండస్ట్రీని ఊపేస్తోంది.
రికార్డు స్థాయిలో కలెక్షన్స్..
సాధారణంగా హారర్ సినిమాలు మొదటి వారం తర్వాత డ్రాప్ అవుతాయి. కానీ, 'అబ్సెషన్' మాత్రం రెండో వారం, మూడో వారం కూడా కలెక్షన్లు పెంచుకుంటూ పోయిన హాలీవుడ్ ఏకైక చిత్రంగా చరిత్ర సృష్టించింది. థియేటర్లలో ఓ రేంజ్ వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూనే ఓటీటీ (OTT) రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనికి కోసం ఫ్యాన్స్ ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు.
కథేంటంటే..
మనసుకు నచ్చిన అమ్మాయి ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలనుకునే ఒక ప్రేమికుడి కథ ఇది. తన క్రష్ ప్రేమ కోసం అతను 'వన్ విష్ విల్లో' (One Wish Willow) అనే ఒక రహస్యమైన చెట్టు కొమ్మను విరుస్తాడు. తాను కోరుకున్న కోరిక నెరవేరుతుంది కానీ.. ఆ కోరిక వెనుక ఎంతటి భయంకరమైన, చీకటి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనేదే ఈ సినిమా అసలు కథ. మైఖేల్ జాన్‌స్టన్,, ఇండే నవరెట్ తమ నటనతో ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టారు.
►ALSO READ | నాయుడు సామ్రాజ్యం కూలే టైం వచ్చింది! 90s బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న 'ఇసకపట్నం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు?
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. నిజానికి ఈ చిత్రం జూన్ 2నే ఓటీటీలోకి రావాల్సింది. కానీ డిస్ట్రిబ్యూటర్ ఫోకస్ ఫీచర్స్, బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షాన్ని చూసి ఆ డేట్‌ను వాయిదా వేసింది. ఈ చిత్రం జూన్ 25న స్ట్రీమింగ్ కానుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రకటించింది.
బాక్సాఫీస్ వద్ద 'స్టార్ వార్స్', 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' వంటి బిగ్గెస్ట్ సినిమాల రికార్డులనే సవాల్ చేసిన ఈ సైకో-హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. థియేటర్ మిస్ అయిన వాళ్లు ప్రైమ్ వీడియోలో చూసేందుకు సిద్ధంగా ఉండండి..
