Ooru Peru Bhairavakona: షాకిచ్చిన ఊరు పేరు భైరవకోన.. ఇది అస్సలు ఊహించలేదు!

Ooru Peru Bhairavakona: షాకిచ్చిన ఊరు పేరు భైరవకోన.. ఇది అస్సలు ఊహించలేదు!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona). వినూత్న చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్(VI Anand) తెరకెక్కించిన ఈ సినిమాలో వర్ష బోళ్ళమా(Varsha Bollama), కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్స్ గా నటించారు. ఫాంటసీ ఎలిమెంట్స్ తో వచ్చిన థ్రిల్లర్ మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.

సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో రాబట్టింది ఈ మూవీ. మొదటిరోజు ఈ సినిమా ఏకంగా రూ.6 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఊరు పేరు భైరవకోన రిలీజ్ కు రెండు రోజుల అనగా ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. ఈ ప్రీమియర్స్ నుండి కూడా సినిమాకు సో సో టాక్ వచ్చింది. అయినప్పటికి మొదటిరోజు రూ.6 కోట్లు రాబట్టింది అంటే అది మాములు విషయం కాదంటున్నారు అనలిస్టులు. అయితే.. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మరీ దారుణంగా ఉందనే టాక్ మాత్రం రాలేదు. దీంతో మ్యాట్నీ, నైట్ షోలు ఫుల్ అయ్యాయి. ఇక శని, ఆదివారాల్లో కూడా అదే హవా కొనసాగించనుంది. 

ఇక నెక్స్ట్ వీక్ వరకు కూడా సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమా ఈజీగా బ్రేకీవెన్ సాధించి మంచి లాభాలు అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక చాలా కాలంగా హిట్టు కోసం చేస్తున్న సందీప్ కిషన్ కు కూడా ఈ సినిమా మంచి హిట్టు పడిందనే చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.