OTT Release This Week: ఈ శుక్రవారం ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్.. ఓటీటీలో ఇవి అసలు మిస్ కావద్దు!

OTT Release This Week: ఈ శుక్రవారం ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్.. ఓటీటీలో ఇవి అసలు మిస్ కావద్దు!

సాధారణంగా వీకెండ్ వస్తుందంటే సినీ ప్రియులకు పూనకాలు వస్తుంటాయి. కానీ ఈ వారం థియేటర్ల వద్ద సీన్ కొంచెం డల్‌గా ఉంది. కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) మే 14న విడుదల కావాల్సి ఉంది, కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడి అభిమానులను నిరాశపరిచింది.

అటు థియేటర్లలో ‘అరేయ్ ఆపండ్రా’, ‘హరుడు’, ‘శివం శైవం’ వంటి సినిమాలు మే 15న పలకరించబోతున్నా, ఆడియన్స్‌లో ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు సినీ ఫ్యాన్స్ అందరి చూపు ఓటీటీ (OTT) వైపు మళ్లింది.  మే 15, శుక్రవారం ఒక్కరోజే వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 16 చిత్రాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతుండటం విశేషం. ఈ వీకెండ్ వినోదం మామూలుగా ఉండదు!

అందరి కళ్లు ‘దురంధర్-2’ పైనే!

ఈ వారం ఓటీటీలో బిగ్గెస్ట్ రిలీజ్ అంటే అది ఖచ్చితంగా ‘దురంధర్-2’.  బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలో క్రేజీ హైప్‌తో వస్తున్న ఈ హిందీ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే దీనిని స్ట్రీమింగ్ చేస్తోంది. ఇండియాలో ఈ డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. దేశీయ స్ట్రీమింగ్ డేట్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నా, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం..


నెట్‌ఫ్లిక్స్ (Netflix):

అత్యధిక కంటెంట్‌తో నెట్‌ఫ్లిక్స్ రెడీగా ఉంది. ‘దురంధర్ 2’తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ‘కర్తవ్య’ అనే డబ్బింగ్ సినిమా సిద్ధమైంది. వీటితో పాటు ‘బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్’, ‘ఇట్స్ నాట్ లైక్ దట్’, ‘ది వండర్ ఫూల్స్’ (కొరియన్),  ‘ది క్రాష్’ అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానున్నాయి.

 

అమెజాన్ ప్రైమ్ & జియో హాట్‌స్టార్:

ప్రైమ్ వీడియోలో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎగ్జామ్’ (తెలుగు డబ్బింగ్) తో పాటు ‘డ్రైవర్స్ ఈద్’ అలరించనున్నాయి. ఇక జియో హాట్‌స్టార్‌లో యాక్షన్ ప్యాక్డ్ ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2’ రచ్చ చేసేందుకు రెడీ అయ్యింది.

►ALSO READ | మా టార్గెట్ 'పెద్ది' కాదు.. ఇది మా బతుకుదెరువు పోరాటం: నిర్మాతలపై తెలంగాణ ఎగ్జిబిటర్ల ఫైర్!

 

టాలీవుడ్ సినిమాలు..
లోకల్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం ఆహా (Aha) లో ‘తిమ్మరాజుపల్లి టీవీ’, సన్ నెక్స్ట్ లో ‘తెరచాప’ సినిమాలు సందడి చేయనున్నాయి. విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి.

 

మిగిలినవి


జీ5లో ‘టిఘీ’ (మరాఠీ), మనోరమ మ్యాక్స్‌లో ‘కప్’ (మలయాళం), లయన్స్ గేట్ ప్లేలో ‘కౌచర్’, హులులో ‘రివల్స్’, ముబీలో ‘ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్‌ ది ఫ్లైమింగో’ వంటి వరల్డ్ సినిమా రకాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. సో.. థియేటర్లలో కిక్ లేకపోయినా, ఓటీటీలో వెరైటీ మూవీస్‌తో ఈ వీకెండ్‌ను గ్రాండ్‌గా ఎంజాయ్ చేసేయండి మరి..