ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు అసలైన వినోదాల జాతర మొదలైంది! థ్రిల్లర్స్, హారర్-కామెడీల నుంచి మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామాల వరకు.. వైవిధ్యమైన కంటెంట్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. మరి ఈ వారం మీ మూడ్‌కి తగ్గట్లుగా ఏ ఏ ఓటీటీలో ఏయే క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో, వాటి ప్రత్యేకతలు ఏంటో పూర్తి వివరాలతో చూసేద్దాం!
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
కరుప్పు (Karuppu)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫాంటసీ యాక్షన్ విజువల్ వండర్ జూన్ 12 నుండి ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్లోబల్ స్ట్రీమింగ్ అవుతోంది. ‘కరుప్పు’ చిత్రాన్నే తెలుగు ఆడియన్స్ కోసం ‘వీరభద్రుడు’ పేరుతో ప్రత్యేకంగా అదే రోజున రిలీజ్ చేశారు. సూర్య మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తెలుగు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
రమణి కల్యాణం (Ramani Kalyanam)
జూన్ 12, 2026: ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సినిమా 'రమణి కల్యాణం' ఈ తెలుగు సినిమా జూన్ 12 నుంచి ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్, ఈటీవీ విన్ ప్లాట్‌ఫారమ్స్‌లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ అవుతోంది.
రాఖ్ (Raakh) ( వెబ్ సిరీస్)
అలీ ఫజల్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'రాఖ్' ( Raakh ) ఈ వెబ్ సిరీస్ జూన్ 12, 2026 హిందీతో పాటు తెలుగు, తమిళ ఆడియోల్లోనూ లభిస్తోంది.
ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్: వెల్‌కమ్ టు బారీస్ బే ( వెబ్ సిరీస్)
ఇంగ్లీష్, తెలుగు, హిందీతో సహా మల్టీపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్ "ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్: వెల్‌కమ్ టు బారీస్ బే " . దీనికి సంబంధించిన మొత్తం 8 ఎపిసోడ్స్ ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఇది జూన్ 10, 2026 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
►ALSO READ | ఆ నంబర్ నుండి కాల్స్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి.. ఫ్యాన్స్‌ను అలర్ట్ చేసిన మీనాక్షి చౌదరి!
షెల్టర్ (Shelter)
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జేసన్ స్టాథమ్ నటించిన గ్రిప్పింగ్ సర్వైవల్ థ్రిల్లర్ 'షెల్డర్' ( Shelter ) ఒక నిర్మానుష్య తీరప్రాంత ద్వీపంలో తుఫాను సమయంలో ఒక చిన్నారిని కాపాడిన వ్యక్తి చుట్టూ, వారి గతం చుట్టూ తిరిగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఇది. జూన్ 12, 2026 నుండి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
అంతే కాకుండా ప్రైమ్ వీడియోలో రెంట్ (Rent) సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటి మైఖేల్, లెట్స్ లవ్, మారమ, మోర్టల్ కాంబాట్ II, నెగ్లెక్టెడ్, బాడ్‌లాండ్ రైజింగ్, బ్లూ ఫిల్మ్, బ్రోకెన్ ల్యాండ్, క్రాకెన్, శాకరిన్, దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్ . ఇవన్నీ ఇంగ్లీష్ చిత్రాలు రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్నాయి.. అలాగే మలయాళ చిత్రం 'పొంగలి', కన్నడ చిత్రం 'నాను కరుణాకర' కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
భూత్ బంగ్లా (Bhooth Bangla)
హారర్ అండ్ స్పోర్ట్స్ హంగామాతో నెట్ ఫ్లిక్స్ రెడీ అయింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత వచ్చిన క్రేజీ హారర్-కామెడీ మూవీ 'భూత్ బంగ్లా' ( Bhooth Bangla ). ఒక పల్లెటూరిలోని వింత భవంతి, దాని వెనుక ఉన్న పురాతన శాపం, ఒక పెళ్లి వేడుకలో జరిగే వింత సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. టబు, వామిఖ గబ్బి, పరేష్ రావల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 12, 2026 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
స్వీట్ మాగ్నోలియాస్: సీజన్ 5 ( వెబ్ సిరీస్)
ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్ 'స్వీట్ మాగ్నోలియాస్: సీజన్5 ఓటీటీలోకి జూన్ 11 తేదీ నుంచే అందుబాటులోకి వచ్చింది. మ్యాడీ, డానా, హెలెన్ జీవితాల్లోని కొత్త సవాళ్లు, ఎమోషన్స్‌తో కూడిన మొత్తం 10 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి.
నార్వే: ది డార్క్ హార్స్ ( డాక్యుమెంటరీ)
ఏకంగా 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నార్వే ఫుట్‌బాల్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2026కు ఎలా క్వాలిఫై అయిందో చూపించే టూ-పార్ట్ డాక్యుమెంటరీ ' నార్వే: ది డార్క్ హార్స్ ' . ఎర్లింగ్ హాలాండ్, మార్టిన్ ఒడెగార్డ్ వంటి స్టార్ ప్లేయర్స్ తెరవెనుక పడ్డ కష్టాలు ఇందులో చూడొచ్చు. జూన్ 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
అవుట్‌లాస్ట్: ది జంగిల్ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ), కలర్స్ ఆఫ్ ఈవిల్: బ్లాక్ (పోలిష్), ది ఈవిల్ లాయర్ (థాయ్), ది పాలిగామిస్ట్ (తెలుగు, హిందీ, జులు), ఐ యామ్ ఫ్రాంకెల్డా (ఇంగ్లీష్) వంటి ఇతర సిరీస్‌లు, సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లో రన్ అవుతున్నాయి.
ఆహా వీడియో (Aha):
హారర్ లవర్స్ కోసం ‘ష్… సీజన్ 3’ (Sshhh Season 3) తెలుగు, తమిళ భాషల్లో 1, 2 ఎపిసోడ్స్‌తో రీసెంట్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్ (ETV Win):
‘రమణి కల్యాణం’ సినిమాతో పాటు సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ‘సెకండ్ మ్యారేజ్’ (Second Marriage) ఈ వారం నుండి డిజిటల్ స్క్రీన్స్ పై సందడి చేస్తోంది.సన్
నెక్స్ట్ (Sun NXT): తెలుగు చిత్రం ‘రమణి కల్యాణం’తో పాటు కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘శాలివాహన శాఖే’ ఇక్కడ అందుబాటులో ఉంది.
జియో హాట్‌స్టార్ (JioHotstar): సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన మలయాళ డ్రామా చిత్రం ‘దృఢం’ (Dridam) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్‌కు వచ్చింది.
జీ5 (Zee5): కన్నడలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సరికొత్త చిత్రం ‘వికల్ప’ (Vikalpa) డిజిటల్ ప్రీమియర్ అయింది.
హాలీవుడ్ స్పెషల్స్
హాలీవుడ్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం HBO Max లో భయపెట్టే హారర్ చిత్రం ‘దే విల్ కిల్ యూ’ (They Will Kill You), లయన్స్ గేట్ ప్లే లో క్లాసిక్ రొమాంటిక్ డ్రామా ‘విక్కీ క్రిస్టినా బార్సిలోనా’ , Shudder యాప్‌లో సైకో థ్రిల్లర్ ‘ఫైండ్ యువర్ ఫ్రెండ్స్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొత్తానికి ఈ వారం 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మరి కొన్ని సిద్ధమయ్యాయి.
