వరుస క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. 'లక్కీ బాస్కర్' మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ . లేటెస్ట్ గా ఒక సీరియస్ సైబర్ మోసంపై స్పందిస్తూ తన అభిమానులను హెచ్చరించింది. తన పేరు వాడుకుంటూ కొందరు కేటుగాళ్లు ఇండస్ట్రీ వారితో పాటు సాధారణ ప్రజలను సైతం బురిడీ కొట్టించడానికి స్కెచ్ వేసినట్లు ఆమె గుర్తించింది.
సైబర్ ఫ్రాడ్‌పై ఆలర్ట్..
తనలా నటిస్తూ (Imposter) మోసాలకు పాల్పడుతున్న సదరు నకిలీ వ్యక్తి వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా మీనాక్షి రట్టు చేసింది. ఆ ఫేక్ పర్సన్ వాడుతున్న ఫోన్ నంబర్‌ను స్క్రీన్ షాట్ తీసి, తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ నంబర్ నుండి ఎవరికైనా మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్స్ వస్తే దయచేసి నమ్మకండి. అది నేను కాదు. వెంటనే ఆ నంబర్‌ను రిపోర్ట్ చేయండి అంటూ నెటిజన్లను అప్రమత్తం చేసింది. అలాగే ఈ ఫ్రాడ్‌ను సకాలంలో తన దృష్టికి తీసుకువచ్చిన ఫ్యాన్స్‌కు ఆమె థాంక్స్ చెప్పింది.
►ALSO READ | బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి సామాన్యుల ఎంట్రీ.. ఆడిషన్స్ రూట్ మ్యాప్ ఇదే, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
నాగచైతన్యతో 'వృషకర్మ'..
ఈ వివాదం పక్కన పెడితే, మీనాక్షి కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న హై-బడ్జెట్ మైథలాజికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో మీనాక్షి... దక్ష అనే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తోంది. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సైబర్ ఫ్రాడ్స్ విషయంలో అలర్ట్ చేస్తూనే, మరోవైపు 'వృషకర్మ' వంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతోంది మీనాక్షి..
