ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ త్వరలో జరగబోయే 2026 టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి కమ్మిన్స్ వైదొలిగినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. అతడి స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. వరల్డ్ కప్ ముందు జరిగిన యాషెస్ సిరీస్ లోనూ కమ్మిన్స్ కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు. 2025 జూన్ నెలలో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన కమ్మిన్స్.. నాలుగు నెలలు క్రికెట్ కు దూరమయ్యాడు. ఓవరాల్ గా కమ్మిన్స్ చివరి 7 నెలల్లో ఒక్క యాషెస్ టెస్ట్ మాత్రమే ఆడాడు.
ప్రస్తుతం వరల్డ్ కప్ నుంచి దూరమైన కమ్మిన్స్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు కమ్మిన్స్ గాయం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురి చేస్తుంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మరో రెండు వారాల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ లోపు వెన్ను గాయం నుంచి కోలుకొని కమ్మిన్స్ ఐపీఎల్ ఆడతాడా అంటే చెప్పలేని పరిస్థితి. వరల్డ్ కప్ కు దూరమైన కమ్మిన్స్.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను ఐపీఎల్ లో పాల్గొంటాడో లేదో ఒక క్లారిటీ ఇచ్చాడు. మార్చి 26న ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌కు తాను ఫిట్‌గా ఉంటానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Also Read ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ
కమ్మిన్స్ మాట్లాడుతూ.. " నేను ఐపీఎల్ ఆడేది లేనిదీ నా వెన్ను గాయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వారాల్లో నాకు మళ్ళీ స్కాన్ జరుగుతుంది. స్కానింగ్ లో నాకు ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. టీ20 వరల్డ్ కప్ లో ఆడలేకపోవడం నిజంగా నా దురదృష్టకరం. నాకు చాలా చిన్న దెబ్బ తగిలింది. కొన్ని వారాల పటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ తర్వాత నేను గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుండి ఎనిమిది వారాల మధ్య సమయం పడుతుందని భావించాను. కానీ ఫాలో-అప్ స్కాన్ చేయించుకున్న తర్వాత నాకు మరో రెండు వారాలు అవసరమైంది". అని కమ్మిన్స్ అన్నాడు.
A "minor setback" ended Pat Cummins' hopes of making it to the T20 World Cup. He's now aiming to be ready for the IPL and Australia's busy schedule ▶️ https://t.co/aaDn2xiCwn pic.twitter.com/Pt2n50rqSb
— ESPNcricinfo (@ESPNcricinfo) February 3, 2026
