WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ.. కన్ఫర్మ్ చేసిన CSK సీఈఓ

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ.. కన్ఫర్మ్ చేసిన CSK సీఈఓ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో జట్ల సంఖ్యను పెంచే ఉద్దేశ్యంలో బీసీసీఐ ఉంది. ప్రస్తుతం ఐదు జట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ మహిళా ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాయి. 2023లో ప్రారంభమైన మహిళా ఐపీఎల్..ఇప్పటికీ మూడు సీజన్ లు పూర్తి చేసుకుంది. మూడు సీజన్ ల పాటు ఐదు జట్లు ఆడాయి. ప్రస్తుతం జరుగుతున్న లీగ్ లోనూ ఐదు జట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. అయితే ఈ లీగ్ లో తొలిసారి ఒక కొత్త జట్టు అదనంగా చేరనుంది. అదేంటో కాదు చెన్నై సూపర్ కింగ్స్ కావడం ఇప్పుడు ఫ్యాన్స్ కు కొత్త కిక్ ఇస్తుంది.    

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ సీజన్ నుంచి దూరంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. CSK సీఈఓ కాశీ విశ్వనాథన్ ఫ్రాంచైజ్ మహిళల క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోకి చెన్నై సూపర్ కింగ్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని CSK సీఈఓ కాశీ విశ్వనాథన్ మంగళవారం (ఫిబ్రవరి 3) ధృవీకరించారు. మహిళల క్రికెట్ తమ మొదటి ప్రాధాన్యత అని అయన ఇన్వెస్ట్ ఇన్ తమిళనాడు కాన్క్లేవ్‌ లో చెప్పుకొచ్చారు. అయితే ఉమెన్స్ జట్టు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా అయన చెప్పలేదు.   

Also Read : వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటికంటే అప్పుడే 10 శాతం బెటర్‌గా ఉంది

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్ (జోబర్గ్ సూపర్ కింగ్స్).. మేజర్ లీగ్ క్రికెట్ లో ఉంది. త్వరలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రావడానికి ఆసక్తి చూపించింది. అంతేకాదు ఇతర క్రీడల్లోకి కూడా తాము వెళ్లవచ్చని ఈ సందర్భంగా ఆయన విశ్వనాథన్ హింట్ ఇచ్చారు. మరి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వస్తే ఈ లీగ్ కు భారీ హైప్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలం సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కో ఓనర్ పార్థ్ జిందాల్ మహిళా ఐపీఎల్ లో కొత్త జట్టు వస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పి హింట్ ఇచ్చారు. 

చివరి రెండు సీజన్ లలో మహిళల ప్రీమియర్ లీగ్ భారీ విజయాన్ని సాధించింది. ఈ కారణంగానే బీసీసీఐ జట్ల సంఖ్యను పెంచాలని భావించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఐపీఎల్ 2026 సీజన్ కోసం రెండు వేదికలకు పరిమితం చేయబడింది. నవీ ముంబై, వడోదర షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. ఈ టోర్నీ విషయానికి వస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 3) ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో  ఢిల్లీ క్యాపిటల్స్,  గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచిన టీమ్ గురువారం జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది.