ఏపీ డిప్యుటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్కి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు, కనీసం వారం నుంచి పది రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. అయితే, ఆయనకు జరిగిన సర్జరీపై మొదట క్లారిటీ లేకపోవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్‌కు ఎటువంటి సర్జరీ జరిగింది? ఇంకా ఎంతకాలం విశ్రాంతి అవసరం? వంటి అంశాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీ:
ఏప్రిల్ 17న అధికారులతో సమావేశంలో పాల్గొంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి MRI స్కాన్ ద్వారా సైనసైటిస్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. (సైనసైటిస్: ముఖ ఎముకలలోని గాలి గదులు వాపునకు గురై, శ్లేష్మం పేరుకుపోవడం వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్)
ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఆయనకు ముక్కుకు సంబంధించిన ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ను డిశ్చార్జ్ చేశారు. కనీసం వారం నుంచి పది రోజుల పాటు రెస్ట్ అవసరమ డాక్లర్లు సూచించారు. అయితే, సైనసైటిస్‌కు శస్త్రచికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు తప్పనిసరి, లేకపోతే వయస్సు పెరిగే కొద్దీ శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించినట్లుగా తెలుస్తోంది.
►ALSO READ | OTT Thriller: హారర్ డోస్‌తో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్.. కథలో విచిత్ర ఘటనలు, ట్విస్టులు
ఈ విషయం తెలిసిన పీఎం మోడీ ఫోన్ స్వయంగా ఫోన్ చేసి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు నేతలు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Thank you, Hon’ble Prime Minister Shri @narendramodi Ji, for your kind words and for taking the time to speak with me and enquire about my health following the surgery. Your concern, encouragement, and wishes for a speedy recovery give me great strength.
— Pawan Kalyan (@PawanKalyan) April 19, 2026
I remain grateful for… https://t.co/JLD9VFtSOe
మోడీ X వేదికగా ట్వీట్ చేస్తూ, “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్యవంతుడు. ఆయన చాలా త్వరగా కోలుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్, ప్రధాని చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని తెలిపారు.

