‘ఆహా వీడియో’లో స్ట్రీమ్ అవుతున్న మిస్టికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘పోచమ్మ’ (Pochamma). ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ సీరీస్ ఓటీటీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తోంది. అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహల్ కామత్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
రమేష్ ఇందిర దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఒక శాపగ్రస్తమైన బంగ్లా చుట్టూ తిరిగే కథతో సాగిన పోచమ్మ ఉత్కంఠరేపే స్క్రీన్ ప్లేతో ఆసక్తిగా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
‘పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు’ లాంటి డైలాగ్స్ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తన గొప్పతనం, మహిమను అంచనా వేయక, తప్పులు చేసే వాళ్లను పోచమ్మ దేవత ఎలా శిక్షించింది? తనను పూజించే వారిని ఎలా రక్షించింది? అనే అంశాలను సిరీస్ లో ఆసక్తిగా చూపించారు మేకర్స్.
‘పోచమ్మ’ కథేంటంటే:
అడవికి ఆనుకుని ఉన్న ఒక మారుమూల ప్రాంతంలో పాతకాలపు ఎస్టేట్ ఉంటుంది. దాని యజమాని రఘుపతి(అచ్యుత్ కుమార్)కు వ్యాపారంలో నష్టాలు రావడంతో దాన్ని బిజినెస్‌మ్యాన్ ఫ్రెడ్రిక్ (రమేష్ ఇందిరా)కు అమ్మేస్తాడు. రఘుపతి అందులోనే మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌజ్ పక్కనే పురాతన కాలం నాటి గ్రామ దేవత పోచమ్మ విగ్రహం ఉంటుంది. ఆ ఎస్టేట్ కాఫీ తోటల్లో చాలామంది పనిచేస్తుంటారు. వాళ్లంతా పోచమ్మనే తమను కాపాడుతుందని నమ్ముతుంటారు.
►ALSO READ | Mahavatar Parshuram: మహావతార్ సెకండ్ ఫ్రాంచైజ్ అనౌన్స్.. ఫస్ట్ లుక్ వీడియో గూస్‌బంప్స్
అయితే.. ఫ్రెడ్రిక్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా విగ్రహాన్ని అక్కడినుంచి తొలగిస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఫ్రెడ్రిక్ కూతురు జెస్సీ (స్నేహల్ కామత్) ఇంటిపైనుంచి పడి చనిపోతుంది. అతని భార్య కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. అవన్నీ పోచమ్మ విగ్రహాన్ని తీసేయడం వల్లే జరిగాయని అంతా నమ్ముతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.

