కొరియన్ డార్క్ ఫాంటసీ, సూపర్‌నేచురల్ మిస్టరీ జానర్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది ఈస్ట్ ప్యాలెస్ (The East Palace)’. ఇంట్రెస్టింగ్ స్టోరీ, మిస్టరీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నామ్ జూ-హ్యూక్, రో యూన్-సియో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో ఫాంటసీ, అతీంద్రియ అంశాలు, మిస్టరీ థ్రిల్ కలగలిపి చూపించారు.
చోయ్ జంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ సస్పెన్స్ కథనంతో ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా ఉంచే ప్రయత్నం చేసింది. కొరియన్ డ్రామాలు, డార్క్ ఫాంటసీ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ది ఈస్ట్ ప్యాలెస్’ మంచి ఎంపికగా నిలుస్తుందా లేదా అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం..
కథేంటంటే:
ముప్పై ఏళ్ల క్రితం ఒక రాజుకి నలుగురు వారసులు ఉండేవారు. కానీ వాళ్లంతా ఒకరి తరువాత ఒకరు చనిపోతారు. ఆ రాజు తర్వాత వచ్చిన క్రౌన్ ప్రిన్స్ ప్రస్తుతం అదే ప్యాలెస్‌లో ఉంటూ పరిపాలిస్తుంటాడు. అయితే, అతని వారసుల్లో కూడా ముగ్గురు వరుసగా చనిపోతారు. నాలుగో కొడుకు చావు బతుకుల్లో ఉంటాడు. వీటన్నింటికీ కారణం కోనేటి దెయ్యమే అని అంతా నమ్ముతుంటారు. దీంతో క్రౌన్ చిన్నతనం నుంచే అతీంద్రియ శక్తులు కలిగిన గు చోన్ (నామ్ జూ హ్యూక్)ను పిలిపిస్తాడు. కోనేటి దెయ్యాన్ని అంతం చేసి, తన కొడుకుని బతికిస్తే, అతను కోరినది ఇస్తానని చెప్తాడు. అయితే అతను వాస్తు నిపుణుడుగా చెప్పుకోవాలని, అసలు విషయం బయట ఎవరికీ తెలియకూడదని ఆదేశిస్తాడు.
ప్యాలెస్‌కి దూరంగా పెరిగిన తన కూతురును పిలిచి, గు చోన్కి తోడుగా ఉంటూ అతన్ని గమనించమని చెప్తాడు. ఇద్దరూ ఆ ప్యాలెస్ పరిస్థితులను పరిశీలించడం మొదలుపెడతారు. యువరాజు ప్రాణాలను తీయాలనుకుంటున్న దెయ్యం గురించి తెలుసుకోవాలని గు చోన్ ప్రయత్నిస్తుంటాడు. అదే టైంలో తన తల్లిని హత్య చేసిన వాళ్లను కనుక్కోవాలని యువరాణి వెతుకుతూ ఉంటుంది. వాళ్ల ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా? లేదా? అసలు నిజాలేంటి? అనేది మిగతా కథ.
🐰📰 | 260722 The Netflix series <The East Palace> has ranked No.2 globally in Netflix’s Top 10 Global Shows (Non-English) just three days after its release.
— roh yoonseo archive (@yoonseoarchive) July 22, 2026
🔗: https://t.co/14run5N3a6#TheEastPalace #동궁 #RohYoonseo #노윤서 #盧允瑞 #ノユンソ pic.twitter.com/KXtYhKJeMo
విశ్లేషణ:
‘ది ఈస్ట్ ప్యాలెస్’ డార్క్ ఫాంటసీ మరియు సస్పెన్స్ మిస్టరీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో రూపొందింది. సాధారణంగా కొరియన్ డ్రామాల్లో ప్యాలెస్ ఆధారిత పీరియడ్ డ్రామాలు ఎక్కువగా పొలిటికల్, లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతాయి. కానీ ఇందులో అతీంద్రియ శక్తులు, దెయ్యాలు మరియు శాపాల నేపథ్యంలో డార్క్ థీమ్‌ను ఎంచుకోవడం మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.
స్క్రీన్ ప్లేలో మిస్టరీని నడిపించిన తీరు, ప్రతీ ఎపిసోడ్‌లో రివీల్ అయ్యే మలుపులు సస్పెన్స్‌ను చివరి వరకు కాపాడటంలో సహాయపడ్డాయి. గు చోన్ (నామ్ జూ-హ్యూక్) అతీంద్రియ శక్తులతో రహస్యాలను ఛేదించే విధానం, యువరాణి తన తల్లి హత్య వెనుక ఉన్న నిజాలను కనుగొనే క్రమంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా కుదిరాయి.
ALSO READ : నెట్‌ఫ్లిక్స్‌లో దొంగలు.. రిలీజ్‌కు ముందే నికోలస్ కేజ్ మూవీ కాపీ చోరీ..
అయితే కథలో దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన డార్క్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల సాధారణ కుటుంబ కథలను, లైట్-హార్టెడ్ రొమాంటిక్ డ్రామాలను కోరుకునే వారికి ఇది అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. డార్క్ థ్రిల్లర్స్, మిస్టరీ జానర్ ఇష్టపడే వారికి మాత్రం ఇది మంచి వాచ్.
