క్రైమ్, కామెడీ, ట్విస్టులతో నిండిన ఓటీటీ ఎంటర్‌టైనర్ కోసం చూస్తున్నారా? అయితే మీ వీకెండ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్ ‘కాన్ సిటీ’ (Con City). అర్జున్ దాస్, అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌కు డెబ్యూ దర్శకుడు హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించారు. యోగిబాబు, సాక్షి వైద్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
డబ్బు కోసం చిన్న చిన్న మోసాలతో జీవించే కొందరు వ్యక్తులు అనుకోకుండా ఓ ప్రమాదకరమైన క్రైమ్ నెట్‌వర్క్‌లో చిక్కుకోవడం, అక్కడి నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు, మధ్యలో వచ్చే ఊహించని ట్విస్టులు, సిట్యుయేషనల్ కామెడీతో ‘కాన్ సిటీ’ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. పూర్తి కథేంటో ఓసారి లుక్కేసుకుందాం..
Con artists ❌
— Netflix India South (@Netflix_INSouth) July 28, 2026
Con kudumbam ✅#ConCityOnNetflix pic.twitter.com/KYRmVQPmyx
కథేంటంటే:
శరవణన్ (అర్జున్ దాస్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ధనవంతుల కుటుంబానికి చెందిన ఐశ్వర్య (సాక్షి వైద్య) అతన్ని ప్రేమిస్తుంది. ఆమె తండ్రి వారిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించినప్పటికీ, శరవణన్‌కు ఉన్న అప్పు విషయం తెలిసిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు. సొంత ఇంటి కోసం తల్లి చేసిన అప్పును తీర్చాలనే ఒత్తిడితో శరవణన్ అవినీతి దారిలోకి వెళ్తాడు. ఇంకొకరితో కలిసి పెద్ద పెద్ద మోసాలు చేయడం మొదలుపెడతాడు.
ఇక మిత్ర (అన్నా బెన్) తనను నమ్మిన వాడే మోసం చేయడంతో ఆ దెబ్బను తట్టుకోలేకపోతుంది. గర్భవతిగా ఉండి, పని చేయలేని పరిస్థితిలో ఆమె కూడా అవినీతి మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇల్లు లీజ్‌కు ఇప్పిస్తానని చెప్పి, ప్రజలను మోసం చేయడం మొదలుపెడుతుంది.
అదే ప్రాంతానికి చెందిన జానకి (వడి ఉక్కరసు) తన కొడుకు జాకీ (యోగిబాబు)తో కలిసి ‘ట్రస్ట్’ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది. తాము చేస్తున్నది తప్పు అని కొడుకు చెప్పినా ఆమె పట్టించుకోదు. చివరికి ఈ ముగ్గురూ కథలు ఎలాంటి మలుపు తిరుగుతాయి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ:
‘కాన్ సిటీ’ సాధారణ క్రైమ్ థ్రిల్లర్ కాదు. క్రైమ్, కామెడీ, ఎమోషన్‌లను సమపాళ్లలో మిళితం చేస్తూ తెరకెక్కించిన డార్క్ క్రైమ్ కామెడీ. డబ్బు కోసం చిన్న చిన్న మోసాలతో మొదలైన పాత్రలు.. అనుకోకుండా పెద్ద క్రిమినల్ నెట్‌వర్క్‌లో చిక్కుకోవడంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయం, వారి నేపథ్యంపై ఎక్కువ దృష్టి పెట్టిన దర్శకుడు.. ఇంటర్వెల్ తర్వాత కథను వేగంగా నడిపిస్తూ ట్విస్టులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాడు.
Con vs Cop 😎🔥#ConCityOnNetflix pic.twitter.com/HCf4ysxeIz
— Netflix India South (@Netflix_INSouth) July 31, 2026
అర్జున్ దాస్ తన ప్రత్యేకమైన బేస్ వాయిస్, సహజ నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి నుంచి పరిస్థితుల కారణంగా నేరాల వైపు మళ్లే వ్యక్తిగా అతని నటన బలంగా నిలుస్తుంది. అన్నా బెన్ తన పాత్రలో ఎమోషన్స్‌ను చక్కగా పలికించి మోసం చేసే విధానాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. యోగిబాబు కామెడీతో పాటు కన్నింగ్ సీన్స్ లో కూడా తనదైన నటనతో మెప్పించాడు. సాక్షి వైద్య తన పాత్ర పరిధిలో బాగా నటించింది.
మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్‌లు, డార్క్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారికి ‘కాన్ సిటీ’ మంచి వీకెండ్ ఛాయిస్. కామెడీ, సస్పెన్స్, ట్విస్టులు, బలమైన నటనతో ఈ సినిమా ఓటీటీలో ఒకసారి తప్పకుండా చూడదగ్గ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
