Payal Rajput: బీరు బాటిల్తో ప్రియుడి బుర్ర బద్దలుకొట్టిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: బీరు బాటిల్తో ప్రియుడి బుర్ర బద్దలుకొట్టిన పాయల్.. వీడియో వైరల్

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్(Payal Rajput) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. RX100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసింది. మొదటి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్.. ఆతరువాత ఏకంగా టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్(Venaktesh) తో వెంకీ మామ(Venky Mama) సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆతరువాత మాత్రం ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయిందని పాయల్. ఇక ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మంగళవారం(Mangalavaaram)తో మరోసారి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా పాయల్ రాజ్ పుత్ సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలలో పబ్ లో బీరు బాటిల్ తో ఒక వ్యక్తి బుర్ర బద్దలు కొడుతూ కనిపిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. అయితే ఇది నిజమైన వీడియో కాదు.. ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఒక వ్యక్తి తలపై కొట్టింది పాయల్. వీడియో చివరకు వరుకు చూస్తే కెమెరా కూడా కనిపించింది.

మరి ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆ వీడియోలో ఉన్నది పాయల్ బాయ్ ఫ్రెండ్ ప్రియుడు సౌరభ్‌ అని, ఇద్దరి మధ్య గొడవ కారణంగానే తాను ఇలా కొట్టి వెళ్లిపోయిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం షూటింగ్ లో భాగాంగాగే తాను అతని తలపై కొట్టిందని వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఈ వీడియో గురించి వస్తున్న వార్తలపై పాయల్ ఏమైనా స్పందిస్తుందో చూడాలి.