Peddi Day 2 Collections: ‘పెద్ది’ 2 డేస్ కలెక్షన్స్: థియేటర్లలో మెగా మాస్ జాతర.. 200 కోట్ల క్లబ్‌ వైపు చరణ్ వేట!

Peddi Day 2 Collections: ‘పెద్ది’ 2 డేస్ కలెక్షన్స్: థియేటర్లలో మెగా మాస్ జాతర.. 200 కోట్ల క్లబ్‌ వైపు చరణ్ వేట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటించిన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. మొదటి రోజు రూ. 135 కోట్ల భారీ గ్రాస్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన చరణ్.. రెండో రోజు కూడా తన మిస్టర్ బాక్సాఫీస్ ఇమేజ్‌ను నిలబెట్టుకుంటూ వీరవిహారం చేశాడు. లేటెస్ట్ గా కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం..

సాధారణంగా భారీ ఓపెనింగ్స్ సాధించిన 'పెద్ది' సినిమా రెండో రోజు కూడా గట్టిగానే వసూళ్లు రాబట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 46 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కోస్తాంధ్రాలోని ఆరు ప్రాంతాల్లో 'పెద్ది' సినిమా సాధించిన రెండో రోజు కలెక్షన్లు.. ఇటీవలి బ్లాక్‌బస్టర్స్ పుష్ప 2, దేవర, ఓజీ చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఆంధ్ర, తెలంగాణాల్లో రెండో రోజు ఒక్కరోజే రూ. 25 కోట్ల గ్రాస్ వసూలైంది. మొత్తంగా ఈ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ ఏకంగా Rs. 181.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇండియాలో రెండు రోజుల్లో కలిపి రూ. 96.40 కోట్ల నెట్ వసూళ్లతో వంద కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో నిలిచింది.

థియేటర్లలో మాస్ జాతర.. 

ఈ చిత్రంలో జానీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఒక సాధారణ పల్లెటూరి యువకుడు తన ఊరి ఆత్మగౌరవం కోసం ఆట మైదానంలో సాగించిన పోరాటం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ALSO READ : అట్టారీ బోర్డర్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ ట్రిబ్యూట్

నైట్ షోస్ హౌస్‌ఫుల్..

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు థియేటర్ల ఆక్యుపెన్సీ సగటున 48.81 శాతం ఉండగా, నైట్ షోలకు అది ఏకంగా 60.15 శాతానికి చేరుకుంది. తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. లాంగ్ వీకెండ్ కావడంతో బుకింగ్స్ జోరు చూస్తుంటే.. శని, ఆదివారాల్లో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మరిన్ని సునామీ రికార్డులు సృష్టించడం ఖాయం అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.