ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్ ఈవెంట్‌కి అట్టారీ బోర్డర్ వేదిక కాబోతోంది. టాప్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా' (Main Vaapas Aaunga) . ఈ మూవీ టీమ్ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వీరుల కోసం ఒక అదిరిపోయే ట్రిబ్యూట్ ప్లాన్ చేసింది. జూన్ 7న అట్టారీ బోర్డర్ వేదికగా 'జై హో - ఎ మ్యూజికల్ సెల్యూట్ టు ది హీరోస్ ఆఫ్ ది BSF' పేరుతో ఒక మెగా లైవ్ మ్యూజికల్ కాన్సెర్ట్ జరగబోతోంది.
బోర్డర్ వద్ద రెహమాన్ మ్యాజిక్..
ఈ ఈవెంట్‌లో ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్. రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. దేశభక్తిని రగిలించే ఆయన స్వరాలతో వాఘా -అట్టారీ సరిహద్దు మార్మోగిపోనుంది. జూన్ 7న సాయంత్రం 4 గంటల30 నిమిషాల నుండి 5 గంటల30 నిమిషాల వరకు ఈ ఈవెంట్ జరగనుంది. జెసిపి స్టేడియం, అట్టారీ బోర్డర్ వేదికగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
క్రేజీ కాంబో..
'రాక్‌స్టార్', 'తమాషా' లాంటి క్లాసిక్స్ తర్వాత.. ఇంతియాజ్ అలీ, ఎ.ఆర్. రెహమాన్, లిరిసిస్ట్ ఇర్షాద్ కామిల్ మళ్లీ 'మై వాపస్ ఆవుంగా' సినిమాతో కలుస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.. దేశ విభజన నాటి ప్రేమ, ఎడబాటు, జ్ఞాపకాల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామాలో ఒక క్రేజీ మల్టీస్టారర్ కాస్టింగ్ ఉంది. యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, పంజాబీ రాక్‌స్టార్ దిల్జిత్ దోసాంజ్, యంగ్ సెన్సేషన్స్ వేదాంగ్ రైనా, శార్వరి ఈ చిత్రంలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
బిర్లా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్ర ప్రమోషన్స్‌ను సరిహద్దుల్లో, రియల్ హీరోల మధ్య ఇంత వినూత్నంగా స్టార్ట్ చేయడం ఇండియన్ సినిమాలోనే ఒక సెన్సేషన్. ఈ మ్యూజికల్ సెల్యూట్‌లో డైరెక్టర్ ఇంతియాజ్, వేదాంగ్ రైనాతో పాటు మోహిత్ చౌహాన్, పూజా తివారి లాంటి స్టార్ సింగర్స్ కూడా సందడి చేయనున్నారు. దేశభక్తి, ఎమోషన్, మ్యూజిక్ కలగలిసిన ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి దేశమంతా వెయిట్ చేస్తోంది..
