
‘మీర్జాపూర్’ సిరీస్‌లో మున్నాభయ్యాగా అలరించిన బాలీవుడ్ నటుడు దివ్వేందు శర్మకు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న‘పెద్ది’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
జూన్ 19 తన పుట్టినరోజు సందర్భంగా దివ్యేందుకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తను ‘రామ్ బుజ్జి’అనే ఇంటరెస్టింగ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్టు రివీల్ చేశారు. క్రికెట్ బంతిని ఎగరేస్తూ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న దివ్యేందు శర్మ లుక్ ఆకట్టుకుంటోంది.
పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో చూశాం. ఇందులో రామ్ చరణ్ క్రికెటర్ పాత్రలో కనిపించి వీపరీతంగా ఆకట్టుకున్నాడు. క్రికెటర్ అంటే ఎదో నేషనల్, ఇంటర్నేషనల్ కాదు.. ఊళ్ళో ఉండే మాస్ క్రికెటర్గా!
Happiest birthday to the ever-energetic my dearest @Divyenndu bro🤗❤️
— BuchiBabuSana (@BuchiBabuSana) June 19, 2025
Truly one of the most lovable and fun souls to work with🤗
Lots of love always brother 😍❤️❤️ pic.twitter.com/dAfaufhASN
క్రికెట్ మ్యాచ్తో మొదలయ్యే గ్లింప్స్, రామ్ చరణ్ మాస్ లుక్, సిగ్నేచర్ షాట్ అంచనాలు పెంచింది. రామ్ చరణ్ ఆడిన ఆటకు, సరైన బౌలర్ అంటే ఎలా ఉండాలో.. లేటెస్ట్ దివ్యేందు లుక్ చెబుతుంది. మాస్‌కు మైండ్‌గేమ్స్ ఆడే క్యారెక్టర్‌గా రాంబుజ్జీ పాత్ర ఉండనుంది. మరి రాంబుజ్జి బౌలింగ్లో పెద్ది ఎలాంటి షాట్స్ ఆడతాడో చూడాలి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్‌గా ఉండనుందని మేకర్స్ తెలియజేశారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
An Action Packed Schedule in full swing @AlwaysRamCharan sir 🔥❤️🤗@divyenndu bro 😍🤗#BTS #Peddi
— BuchiBabuSana (@BuchiBabuSana) May 22, 2025
GLOBAL RELEASE ON 27th March 2026💥 pic.twitter.com/mEyoyBQP6O