రామ్ చరణ్ 'పెద్ది' కి షాక్ ట్రీట్‌మెంట్... జాన్వీ కపూర్ వివాదాస్పద సీన్స్‌ తొలగింపు, ఎందుకంటే?

రామ్ చరణ్ 'పెద్ది' కి షాక్ ట్రీట్‌మెంట్... జాన్వీ కపూర్ వివాదాస్పద సీన్స్‌ తొలగింపు, ఎందుకంటే?

బాక్సాఫీస్ వద్ద రూ. 315 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లతో 'పెద్ది' (Peddi) సునామీ సృష్టిస్తోంది. రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు సనా ఎమోషనల్ టేకింగ్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కానీ, థియేటర్లలో కాసులు కురుస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ వివాదం నడుస్తోంది. గ్లోబల్ స్టార్ పక్కన నాయికగా నటించిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 'అచ్చియమ్మ' క్యారెక్టర్‌ను చూపించిన విధానంపై నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఆ సీన్స్ కట్.. 

ఈ క్రేజీ కాంట్రవర్సీకి దర్శకుడు బుచ్చిబాబు ఎట్టకేలకూ ఫుల్‌స్టాప్ పెట్టారు.  జరిగిన తప్పును ఒప్పుకుంటూ ఇటీవల క్షమాపణలు కూడా చెప్పారు. సినీ ప్రియులు, మహిళల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్న సన్నివేశాలను తొలిగిస్తామని హామీ ఇచ్చారు.  లేటెస్ట్ గా ఆ వివాదాస్పద సీన్స్‌ను థియేట్రికల్ వర్షన్ నుండి పూర్తిగా తొలగించినట్లు అధికారికంగా ప్రకటించారు. 

 

అసలేం జరిగింది?

1980ల నాటి విజయనగరం మారుమూల గిరిజన ప్రాంతం నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ కథలో జాన్వీ కపూర్ పాత్రపై భారీ అంచనాలు ఉండేవి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. అచ్చియమ్మ ఇంట్రడక్షన్ సీన్, కొన్ని రొమాంటిక్ షాట్స్ పూర్తిగా పురుషాధిక్య కోణంలో ఉన్నాయని, కేవలం గ్లామర్ కోసమే ఆమెను వాడుకున్నారనే విమర్శలు వచ్చాయి. పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యతను పక్కనపెట్టి, కెమెరా యాంగిల్స్ ఆమె ఫిజిక్‌ను హైలైట్ చేసేలా ఉన్నాయని సినిమాటోగ్రఫీపై ట్రోల్స్ వచ్చాయి.

►ALSO READ | Bigg Boss Telugu 10: లీకైన 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' సెలబ్రిటీల లిస్ట్..? సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష 2'!

డైరెక్టర్ వివరణ..

ఈ వివాదంపై బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నా 'ఉప్పెన' సినిమాకు, 'పెద్ది'కి నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. హీరో పెరిగిన వాతావరణం వల్ల మొదట్లో అతడిలో కాస్త మొరటుతనం, అపరిపక్వత ఉంటాయి. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలనే మైండ్‌సెట్ అతనిది. ఆ మొరటుతనాన్ని మార్చే శక్తి ప్రేమకు ఉందని చూపించడమే నా ఉద్దేశం. కానీ స్క్రీన్‌ప్లే ఎగ్జిక్యూషన్‌లో కొన్ని షాట్స్ తప్పుగా ప్రొజెక్ట్ అయ్యాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను గౌరవించి, ఆ మిస్‌లీడింగ్ సీన్స్‌ను తొలగించాం అని చెప్పారు. ప్రేక్షకులను క్షమాపణ కూడా చెప్పారు.

బాక్సాఫీస్ 'పెద్ది' జాతర..

వివాదాలు ఎలా ఉన్నా, కలెక్షన్ల వేటలో 'పెద్ది' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జగపతిబాబుక్యారెక్టరైజేషన్, రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ లుక్, పల్లెటూరి నేపథ్యంలో క్రికెట్ ద్వారా హక్కుల కోసం పోరాడే కథాంశం ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది. ఇప్పుడు వివాదాస్పద సీన్స్ కూడా కట్ అవ్వడంతో, ఫ్యామిలీ ఆడియన్స్‌కు 'పెద్ది' మరింత చేరువ కావడం ఖాయంగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..