
భారీ సినిమాలు, అదిరిపోయే కలెక్షన్స్.. మాట వినబడితే..బాలీవుడ్ అనే రోజులు పోయాయి. తెలుగు సినిమాల సత్తా ఇంటర్నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ తోను, భారీ నిర్మాణంతోనూ దూసుకెళ్లాయి. అలాగే కన్నడ సినిమాలు కూడా కె.జి.యఫ్ మూవీతో మొదలై..చిన్న సినిమాల వరకు వందల కోట్లు వసూళ్లు నమోదు చేస్తున్నాయి.
రీసెంట్ గా కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం సప్త సాగరాలు ఎల్లో (సైడ్ ఏ). అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati ) పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ మూవీకి తెలుగులో ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఇప్పుడు ఈ సినిమాకు సైడ్ బి అంటే సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రొడక్షన్ హౌస్ అయిన..పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) ట్విట్టర్లో ఫోటో షేర్ చేసింది. వచ్చే నెల నవంబర్ 17న సప్తసాగరాలు దాటి (సైడ్ బి)(SaptaSagaraaluDhaati SideB) ని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి కన్నడ తో పాటు తెలుగు,తమిళ్..ఇతర భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
We return to spread love across boundaries ?#SaptaSagaraaluDhaatiSideB is coming to your nearest cinemas on 17th November ☺️#SSESideBNov17 #SSDSideBNov17@rakshitshetty @hemanthrao11 @rukminitweets @Chaithra_Achar_ @charanrajmr2701 @AdvaithaAmbara #ParamvahPictures… pic.twitter.com/x1qtwmzzi6
— People Media Factory (@peoplemediafcy) October 20, 2023
ఈ మూవీ ఫస్ట్ పార్ట్ స్టార్టింగ్ లోనే రెండో పార్ట్ ఉంటుందని డైరెక్టర్ హేమంత్ ఎం రావు క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ పార్ట్ సప్త సాగరాలు దాటి (సైడ్ ఏ) మూవీనే..ఇప్పటికీ ఆడియన్స్ మనసులోచింది వెళ్ళలేదు. రీసెంట్ గా ఓటీటీ లోను రిలీజ్ అయ్యి..మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది.
ALSO READ: దారుణంగా మోసపోయా.. బిగ్ బాస్ ఆరోహి వీడియో వైరల్
అంతేకాకుండా..ఈ మూవీలో హీరో హీరోయిన్ల యాక్టింగ్,మ్యూజిక్ రెండింటిని వేరు చేసి చూడలేం. మొత్తం పాటలు మనల్ని తెరపై ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. నేపథ్య సంగీతం థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతు వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక సినిమా చూసిన ప్రతీ ఒక్కరు హార్డ్ టచింగ్ సినిమా అని, గుండెల్ని పిండేసే సినిమా అని రివ్యూలు కూడా ఇచ్చేశారు. దీంతో సప్తసాగరాలు దాటి (సైడ్ బి) మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.