
హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుండి ఎప్పుడు మంచి ఆధారణే ఉంటుంది. అందుకే ఈ జానర్ లో సినిమాలు చేసేందుకు మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఆడియన్స్ కూడా తమను ఆ సినిమా ఎంత భయపెడితే అంతలా మెచ్చుకుంటారు. తాజాగా అలాంటి జానర్ లో వచ్చిన సినిమానే పిండం. దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో కనిపించారు.
టీజర్ ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ లో థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని సాధించింది. మోస్ట్ స్కేరియెస్ట్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ భయపెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక థియేటర్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటిటిలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. తెలుగు స్ట్రీమింగ్ మాత్రం ఆహాలో అవుతోంది. ఇక ఓటీటీలో కూడా ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్ వ్యూస్ అందుకుంటుంది. మరి ఫ్రీగా ఉంటే మీరు కూడా ఈ సినిమా చూసి భయపడండి.