HanuMan: రఘునందన ఈజ్ కమింగ్.. గూస్బంప్స్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్

HanuMan: రఘునందన ఈజ్ కమింగ్.. గూస్బంప్స్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్

ప్రపంచవ్యాప్తంగా హనుమాన్(HanuMan) మూవీ సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్ఛర్య పరిచింది. స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డ్స్ ను సెట్ చేసిన. ఇక ఓవర్ సీన్ లో అయితే హనుమాన్ విద్వంసం సృష్టించింది. అక్కడ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే.. ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది మొదట గ్రాఫిక్స్ అయితే, రెండవది మ్యూజిక్ అనే చెప్పాలి. గౌరహరి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిలో మరీ ముఖ్యంగా రఘునందన రఘు రఘు  నందన అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హనుమాన్ సెకండ్ హాఫ్ లో హనుమంతుని శక్తుల గురించి విభీషణుడు వివరిస్తున్న సీన్ లో వచ్చే ఈ పాత ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పించింది. విభీషణుడు చెప్పే ఒక్కో డైలాగ్ కు వచ్చే ఒక్కో సీన్.. ఆ సీన్ కు బీజీఎమ్ గా వచ్చే రఘునందన సాంగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. 

నిజానికి ఈ సాంగ్ కోసం ఆడియన్స్ సినిమా రిలీజ్ నుండి ఎదురుచూస్తున్నారు. హనుమాన్ ఆడియో జ్యూక్ బాక్స్ లో కూడా ఈ పాట లేకపోవడంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆడియన్స్ ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ.. రఘునందన సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. త్వరలో రఘునందన ఈజ్ కమింగ్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ సాంగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్వరలోనే ఈ పాట రిలీజ్ కానుందని అర్థమవుతోంది. ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.