జగిత్యాలలో భారీగా గుట్కా స్వాధీనం

జగిత్యాలలో భారీగా గుట్కా స్వాధీనం

జగిత్యాలలో ఓ వ్యక్తి ఇంట్లో భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  రూరల్  పోలీస్ స్టేషన్ పరిధిలోని థరూర్ గ్రామంలో ఆదివారం రాత్రి కటకం సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో, కిరాణ షాపులో తనిఖీ  చేయగా.. 8 బ్యాగుల్లో   సుమారు రూ.3,10,500 విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  అక్రమంగా ప్రభుత్వ నిషేధిత గుట్కా ఉత్పత్తులను అమ్మినా, సరఫరా చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రూరల్ సి.ఐ రాజేష్, ఎస్.ఐ సతీష్ చెప్పారు.

see more news

ఒకే రోజు 61,408 కేసులు..57,468 మంది డిశ్చార్జ్

నా చిరకాల స్నేహితుడిని కోల్పోయాను