నేటి తరం హీరోల్లో ఆ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్

నేటి తరం హీరోల్లో ఆ ఘనత సాధించిన ఏకైక హీరో ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ ఉన్నారు. ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో సలార్(Salaar) సినిమా చేస్తున్న ప్రభాస్.. ఆ తరువాత నాగ్ అశ్విన్(Nag ashwin) దర్శకత్వంలో కల్కి(Kalki) సినిమాలో నటిస్తున్నారు. మధ్యలో దర్శకుడు మారుతి(MAruthi)తో కూడా ఒక కామెడీ సినిమా చేస్తున్నారు ప్రభాస్. 

ఈ క్రమంలో ప్రభాస్ ఈ తరం నటుల్లో ఎవరూ సాధించలేని ఒక అరుదైన ఘనతను సాధించాడు. అదేంటంటే.. మాస్ హీరోగా ప్రభాస్ కు నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఉంది. అలాగని ఆయన కేవలం కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితమవలేదు. ఓపక్క సలార్ లాంటి మాస్ మూవీస్ చేస్తూనే.. ఈ మధ్య ఆదిపురుష్ లాంటి పురాణకథల్లో కూడా నటిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే బాహుబలి వంటి జానపద సినిమాల్లో కూడా నటించాడు. 

ALSO READ | ఆ భయంతోనే పెళ్ళికి దూరం.. నటుడు బైల్వాన్‌ షాకింగ్ కామెంట్స్

ఇప్పుడు మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప మూవీలో శివుడి పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశాడు మంచు విష్ణు. ఇలా సినిమా సినిమాకి కొత్త ధనాన్ని చూపిస్తూ.. నేటి తరం హీరోల్లో అన్ని రకాల పాత్రలు చేస్తున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. పురాణ, సాంఘీక, జానపద, ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా, కథ ఏదైనా ఒకే ఆప్షన్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్ హీరో గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.