
ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ టీజర్ వస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు ‘రాజా సాబ్’టీజర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రాజా సాబ్ టీజర్ ఆన్‌లైన్‌లో లీకైన విజువల్స్ కారణంగా.. నిర్మాతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే, సోషల్ మీడియాలో టీజర్ వీడియో ప్రత్యక్షమవ్వడంతో మేకర్స్ గట్టిగా స్పందించారు.
‘ది రాజా సాబ్.. నుండి లీకైన కంటెంట్‌ను షేర్ చేసే అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిని షేర్ చేయకుండా మాకు అందరూ సహకరించాలని, మాతో నిలబడాలని అభ్యర్థిస్తున్నాం. బాధ్యతాయుతంగా టీజర్ వేడుకలు జరుపుకుందాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి’అని సోషల్ మీడియాలో వార్నింగ్ నోట్ జారీ చేశారు.
Strict action will be taken and handles will be suspended immediately if any leaked content from #TheRajaSaab is found….
— The RajaSaab (@rajasaabmovie) June 13, 2025
We request everyone to cooperate and stand with us in protecting the experience….
Let’s celebrate responsibly. Be aware. ⚠️
ఇలా టీజర్ లీక్ కావడం దురదృష్టకరం అయినప్పటికీ, అభిమానులు మరికొంత కాలం వేచి ఉండి, అధికారికంగా విడుదలయ్యాక పూర్తి అనుభవాన్ని ఆస్వాదించాలని కోరుతున్నారు. అప్పటి వరకు, సినిమా యొక్క ఉత్సాహాన్ని మరియు సమగ్రతను కాపాడటానికి అందరూ కలిసి వస్తారని రాజాసాబ్ బృందం ఆశిస్తోంది.
Just chillin’ while cooking up something spine chilling 😎🤟🏻#TheRajaSaabTeaser on June 16th at 10:52AM 🔥#TheRajaSaab #TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @SKNOnline… pic.twitter.com/gzBqqroYDz
— People Media Factory (@peoplemediafcy) June 11, 2025
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ తన మాస్ ఇమేజ్ ను పక్కనబెట్టి.. తన కెరియర్లో ఫస్ట్ టైం హార్రర్ కామెడీ చేస్తున్నారు. ప్రభాస్ కామెడీ రోల్ ను ను చూడటానికి డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ మరియు యోగి బాబు ప్రముఖ పాత్రల్లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి రానుంది.