టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్: నాన్ స్టిక్ ప్యాన్ లకు గీట్లు పడకుండా.. ప్యాన్ హ్యాండిల్

టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్: నాన్ స్టిక్ ప్యాన్ లకు గీట్లు పడకుండా.. ప్యాన్ హ్యాండిల్

స్టీల్‌‌‌‌‌‌‌‌ పట్టకారతో పట్టుకుంటే నాన్‌‌‌‌‌‌‌‌స్టిక్‌‌‌‌‌‌‌‌ ప్యాన్‌‌‌‌‌‌‌‌లకు గీట్లు పడతాయి. కుండలు పగిలే ప్రమాదం ఉంది. అందుకే అలాంటివాటిలో వంట చేస్తున్నప్పుడు పట్టుకునేందుకు ఈ సిలికాన్‌‌‌‌‌‌‌‌ హ్యాండిల్ బాగా ఉపయోగపడుతుంది. బేకింగ్ ట్రేలతో పాటు దాదాపు అన్ని రకాల వంట పాత్రలను దీంతో పట్టుకోవచ్చు. 

దీన్ని ఫెబ్‌‌‌‌‌‌‌‌జోనా అనే కంపెనీ తీసుకొచ్చింది. దీని చారల డిజైన్‌‌ వల్ల గ్రిప్‌‌‌‌‌‌‌‌ బాగుంటుంది. పట్టుకునే భాగంలో సిలికాన్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ దాని వెనుక భాగంలో బలమైన స్టెయిన్‌‌‌‌‌‌‌‌లెస్ స్టీల్ రాడ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. తయారీలో మన్నికైన సిలికాన్ వాడడం వల్ల వేడిని తట్టుకోగలదు. దీంతో 10 కిలోల వరకు బరువును పట్టుకోవచ్చు. 

►ALSO READ | టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్: ఒకేసారి మూడు పనులు చేసే.. పెట్ బ్రష్‌‌‌‌‌‌‌‌