నాన్న కూడా అనేసరికి చచ్చిపోవాలనుకున్నా.. ప్రియాంక ఎమోషనల్ కామెంట్స్

నాన్న కూడా అనేసరికి చచ్చిపోవాలనుకున్నా.. ప్రియాంక ఎమోషనల్ కామెంట్స్

ప్రతీ ఒక్కరి జీవితంలో బాధలు, కష్టాలు అనే సహజం. పైకి నవ్వుతున్నంత మాత్రాన వారి జీవితం హ్యాపీగా ఉందనుకుంటే పొరబాటే. ఆ నవ్వు వెనకాల బాధను కొంత మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. అలా తన జీవితంలో కూడా కన్నీటితో గడిపిన రోజులు ఉన్నాయని, కొన్నిసార్లు అవన్నీ భరించలేక చచ్చిపోవాలనుకున్నానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు ప్రియాంక సింగ్(Priyanka Singh). జబర్దస్త్ షో ద్వారా చాలా మందికి పరిచయం. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన అద్భుతమైన ఆట తీరుతో తనలాంటి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితం గురించి, తాను అనుభవించిన కష్టాలా గురించి, అమ్మాయిగా మారిన విధానం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నప్పుడు మా అక్క బట్టలు వేసుకోవాలని, అమ్మాయిలాగా ఉండాలని అనిపించేది. పదవతరగతి అయ్యాక హైదరాబాద్ వచ్చాను. ముందు మేకప్ ఆర్టిస్టుగా, తరువాత జబర్దస్త్ లో చేశాను. అలా వచ్చిన డబ్బుతోనే అమ్మాయిగా మారడానికి సర్జరీ చేయించుకున్నాను. ఆ సమయంలో విపరీతమైన నొప్పిగా ఉండేది. ఆ విషయం, ఎవరికీ తెలియదు. ఒక్కదాన్ని నరకం అనుభవించాను. దానివల్ల ఆరోగ్యం పాడయింది. సెట్ అవడానికి మళ్ళీ సర్జరీలు చేయించుకున్నా. 

Also Read: మీకెలా ఉందోకానీ.. మాకు: సన్నిలియోన్ స్టయిల్లో మంచు లక్ష్మి ఫొటోషూట్

చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. చాలా మంచి నన్ను ఏమని హేళన చేసేవారో అదే మాట మా నాన్న నోటి నుండి విన్నప్పుడు నా గుండె బద్దలయ్యింది. ఇక బ్రతకకూడదని ఒంటిపై కిరోసిన్ పోసుకొని అంటించుకున్నా. కానీ, బ్రతికాను. మరో రెండు సందర్భాల్లో కూడా చనిపోవాలని స్లీపింగ్ పిల్స్ మింగాను కానీ, అప్పుడు కూడా బ్రతికాను. దాంతో.. దేవుడు నాకోసం ఎదో రాసిపెట్టి ఉంటాడు అందుకే బ్రతికాను అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రియాంక సింగ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.