Manchu Lakshmi: సన్నిలియోన్ స్టయిల్లో మంచు లక్ష్మి ఫొటోషూట్

Manchu Lakshmi:  సన్నిలియోన్ స్టయిల్లో మంచు లక్ష్మి ఫొటోషూట్

మంచు లక్ష్మి(Manchu Lakshmi).. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Moahan Babu) వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి.. ముందు నిర్మాతగా, తరువాత యాంకర్ గా, ఆ తరువాత నటిగా మారారు. అయితే కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. అడపాదడపా గ్లామర్ షో కూడా చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. 

Also Read: అనుపమా.. నువ్వూ మారిపోయావా.. బోల్డ్ బ్యూటీగా కొత్త జర్నీ

తాజాగా తనలోని హాట్ అండ్ గ్లామర్ కోణాన్ని ఆడియన్స్ కు పరిచయం చేశారు మంచు లక్ష్మి. సోషల్ మీడియా వేదికగా తన ఫుల్ లెన్త్ గ్లామర్ షోతో రెచ్చిపోయారు. లేటెస్ట్ ఫోటో షూట్ లో ఆమె బికినీలో కనిపించి షాకిచ్చారు. బ్లాక్ కలర్ టూ పీస్ సూట్ లో తనదైన గ్లామర్ ఒలకబోస్తూ నెటిజన్స్ కు నెక్స్ట్ లెవల్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇదేక్కడి మాస్ అవతారం లచ్చక్క, లేటు వయసులో ఈ ఘాటు ఫోటో షూట్స్ ఏంటో  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ హాట్ హాట్ ఫోటో షూట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేయండి. 

ఇక మంచు లక్ష్మి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అగ్ని నక్షత్రం అనే సినిమా చేస్తున్నారు. కోర్ట్ రూమ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కూడా కీ రోల్ చేస్తున్నారు. వంశీ కృష్ణ మల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.