బిగ్ బాస్ తెలుగు సీజన్-3 కంటెస్టెంట్, సినీ నటి పునర్నవి భూపాలం పెళ్లి చేసుకుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ హేమంత్తో ఏడడుగులు నడిచింది. ఎలాంటి అట్టహాసంగా లేకుండా బంధుమిత్రుల సమక్షంలో ఈ కొత్త జంట ఒక్కటైంది. హేమంత్ వర్మ వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్. పునర్నవి, హేమంత్.. డిసెంబర్ 5, 2025న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఉయ్యాలాజంపాలా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి పునర్నవి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకుంది.
పిట్టగోడ, సైకిల్, మనసుకు నచ్చింది.. ఇలా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు చెప్పుకోదగిన గుర్తింపు దక్కలేదు. ఆ సమయంలోనే బిగ్ బాస్ సీజన్-3లో ఆమెకు అవకాశం దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని పునర్నవి చక్కగా వినియోగించుకుంది. తన పదునైన మాటలతో బిగ్ బాస్-3 సీజన్తో బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైంది.
సోషల్ మీడియాలో ఆ టైంలో పునర్నవి ట్రెండింగ్ టాపిక్ అయింది. బిగ్ బాస్- సీజన్-3లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఇద్దరినీ పలు టీవీ షోలకు పిలిచి రాహుల్, పునర్నవి ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ను టీఆర్పీల కోసం టెలివిజన్ ఛానళ్లు బాగా వాడుకున్నాయి. నిజ జీవితంలో కూడా లవర్స్ అనే ప్రచారం నడిచింది. కానీ.. అవన్నీ పుకార్లేనని ఆ తర్వాత తేలిపోయింది.
►ALSO READ | Rajamouli Dhurandhar 2 Review: ‘ధురంధర్ 2’పై రాజమౌళి టాప్ క్లాస్ ఎనాలిసిస్!
హరిణ్య రెడ్డిని రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకోవడంతో ఈ పుకార్లకు పూర్తిగా తెరపడింది. పునర్నవి కూడా ఇప్పుడు ఆమె లవర్ అయిన హేమంత్ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పునర్నవి వయసు 29 సంవత్సరాలు. 2020 తర్వాత ఆమె సినిమాలు, టీవీ షోలకు పూర్తిగా దూరమైంది. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో ఆమె చేసిన పాత్రకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది.
