బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’పై సినీ స్టార్స్ స్పందిస్తున్నారు. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ చూసిన ప్రతిఒక్కరిలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతున్నట్లు కనిపిస్తోంది.అందులోను సినిమా చూసి స్పందిస్తున్న దిగ్గజాల మాటలు మరింత హై ఇస్తున్నాయి.
లేటెస్ట్గా దర్శకధీరుడు రాజమౌళి సైతం ‘ధురంధర్ 2’పై ప్రశంసలు వర్షం కురిపించారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ మేకింగ్, హీరో రణవీర్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్, మ్యూజిక్ & టీమ్‌ని అభినందిస్తూ X వేదికగా భారీ పోస్ట్ పెట్టి, మరిన్ని అంచనాలు పెంచేసాడు.
“ధురందర్-1”తో పోలిస్తే “ధురందర్-2ది రివెంజ్” మరింత విస్తృతంగా, ఎమోషన్స్ పరంగా ఏమాత్రం తగ్గలేదని రాజమౌళి పేర్కొన్నారు. రచన, క్యాస్టింగ్ సెలక్షన్, మ్యూజిక్, టెక్నీషియన్స్.. ఇలా అన్నీ కలిసి ఈ సినిమాను పీక్ లెవల్లో నిలబెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు.
దర్శకుడు ఆదిత్యధర్ తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాన్ని కూడా రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాలుగు గంటల పాటు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని తెరపై ఆవిష్కరించడం చాలా గ్రేట్. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుతున్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి అని జక్కన్న తెలిపారు.
ALSO READ : స్నేక్ డ్యాన్స్‌తో ‘రాకాస’ సాంగ్ రచ్చ..
అలాగే, హీరో రణ్‌వీర్ సింగ్ తన నటనతో భారీ ఇంపాక్ట్ తీసుకొచ్చారు. జస్కిరాత్ సింగ్, హమ్జా అలీ మజారీగా రెండు పాత్రలతో ఆడియన్స్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా షెడ్డులో బంధించిన సోదరిని కలిసే సమయంలో ఆయన నటన మాస్టర్‌క్లాస్ అని.. క్లైమాక్స్‌లో రణ్‌వీర్ నటన హృదయాన్ని మెలిపెట్టేలా ఉందని జక్కన్న అభిప్రాయపడ్డారు.
అదే విధంగా ఒక దేశం యొక్క నిస్సహాయతను, నిరాశను అద్భుతంగా ప్రదర్శించారంటే R మాధవన్ ని అభినందించారు. చివరగా.. మీ విజయాన్ని మా విజయంగా మేము భావిస్తున్నాం.. ఈ ఘన విజయం మనందరిదీ’’ అని రాజమౌళి తదనదైన స్టైల్లో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
I loved Dhurandhar-1, but The Revenge surpassed the original in both scale and soul.
— rajamouli ss (@ssrajamouli) March 21, 2026
The writing, casting, technical execution, music, world design and direction are flawless…. But it’s the emotional stakes that really ground it.
The writing manages to weave plot twists that…
ఈ సందర్భంగా జక్కన్న సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని, భావోద్వేగాలని, మెయిన్ ఆర్టిస్టుల నటన, దర్శకుడి ప్రతిభని ప్రశంశిస్తూ ధురంధర్ ది రివేంజ్‌పై ఇచ్చిన టెర్రిఫిక్ ఎనాలిసిస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం జక్కన్న ట్వీట్తో ‘ధురంధర్ 2’ వరల్డ్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే.. టాలీవుడ్ టాప్ స్టార్స్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేష్ బాబు సైతం సినిమా చూసి టీంని అభినందించారు.
ఇదిలా ఉంటే.. 2025లో విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం రూ. 1300 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. ఇపుడు పార్ట్ 2 సైతం అంతకుమించి అనేలా దూసుకెళ్తోంది. 2 వేల కోట్ల టార్గెట్ దిశగా బాక్సాఫీస్ను శాసిస్తుంది. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం ప్రాణం పోశారు.
