Snake Dance Video: స్నేక్ డ్యాన్స్‌తో ‘రాకాస’ సాంగ్ రచ్చ.. క్రేజీ స్టెప్పులతో సోషల్ మీడియా షేక్

Snake Dance Video: స్నేక్ డ్యాన్స్‌తో ‘రాకాస’ సాంగ్ రచ్చ.. క్రేజీ స్టెప్పులతో సోషల్ మీడియా షేక్

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బ‌‌న్సాల్ నిర్మించిన చిత్రం ‘రాకాస’.  ఏప్రిల్ 3న సినిమా రిలీజ్  కానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా, శుక్రవారం స్నేక్ డ్యాన్స్‌‌ అనే పాటను విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. క్యాచీ లిరిక్స్, క్రేజీ స్టెప్పులు ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలోని నటీనటులంతా కలిసి ఇందులో స్నేక్  డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనుదీప్ దేవ్ కంపోజ్ చేసిన ఈ పాటకు రఘురామ్ క్యాచీ లిరిక్స్ అందించాడు. బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జి రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది.

‘మన బాలు గాడికి బ్రేక్ డ్యాన్స్ రావట్లే.. వీరు గాడికి వీణ స్టెప్ పలకట్లే.. మన శీను గాడికి కూచిపూడి  టచ్‌‌లేదు..’ అంటూ సాగిన పాటలో  సంగీత్ శోభన్, నయన్ సారికతోపాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తమదైన ఫన్నీ డ్యాన్స్‌‌ మూమెంట్స్‌‌తో ఎంటర్‌‌‌‌టైన్ చేశారు. చివర్లో  ప్రొడ్యూసర్ నిహారిక వేసిన స్టెప్పులు హైలైట్‌‌గా నిలిచాయి.